ఆ నలుగురు హీరోలకు డ్రగ్ టెస్ట్ చేయండి... కంగనా డైరెక్ట్ అటాక్

బాలీవుడ్ లో ప్రతి రోజు ఏదో ఒక విషయంతో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న డేరింగ్ క్వీన్ కంగనా రనౌత్.సుశాంత్ ఇష్యూ తర్వాత బాలీవుడ్ ప్రక్షాళన జరగాలని కోరుకుంటున్న ఆమె బీ టౌన్ లో ప్రమాదకర సంస్కృతిగా ఉన్న నెపోటిజంని టార్గెట్ చేసింది.

 Kangana Ranaut Demands A Drug Test To Heroes, Bollywood , Nepotism, Sushant Sing-TeluguStop.com

ఈ బంధుప్రీతి కారణంగా ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ అవకాశాలు కోల్పోతున్నారని గొంతెత్తింది.చాలా మంది సెలబ్రెటీలు ఆమెతో గొంతు కలిపారు.

అదే సమయంలో ఆమె అనవసరంగా రాద్ధాంతం చేసి కావాలనే తన వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి సుశాంత్ ఇష్యూని వాడుకుంటుందని విమర్శలు కూడా వస్తున్నాయి.అయితే తనపై వస్తున్న విమర్శలకి అదే స్థాయిలో సమాధానాలు చెబుతూ తనకు చేయాలని అనుకున్న పని చేసుకుంటూ పోతుంది.

తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్ సంస్కృతి విపరీతంగా ఉందని విమర్శలు చేసిన కంగనా తాజాగా మరోసారి సంచలన వాఖ్యలు చేసింది.

తాజాగా డ్రగ్స్ తీసుకుంటున్న హీరోల పేర్లు బయటపెట్టి మరో వివాదానికి నాంది పలికింది.

రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశిక్ లు డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేసింది.వీరు నలుగురూ కొకైన్ వాడతారనే ప్రచారం బాలీవుడ్ లో ఉందని కంగనా తెలిపింది.

డ్రగ్ టెస్ట్ చేయించుకుని తమపై పడిన అపవాదును వారు తొలగించుకోవాలని చెప్పింది. రక్త పరీక్షల్లో వారికి క్లీన్ రిపోర్ట్ వస్తే లక్షలాది మందికి స్ఫూర్తిదాతలుగా అవతరిస్తారని తెలిపింది.

తాను చేసిన ట్వీట్ ను ప్రధాని మోదీ కార్యాలయానికి కూడా ట్యాగ్ చేసింది.అయితే కంగనా ఈ స్థాయిలో బాలీవుడ్ ప్రముఖులని టార్గెట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది.

కంగనా చేస్తున్న విమర్శలని వారు యాక్సప్ట్ చేస్తున్నారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube