హాలీవుడ్ హీరో డ్వెయిన్, అతని కుటుంబానికి కరోనా పాజిటివ్..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వ అధికారులు, సామాన్య ప్రజలకు ఈ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది.

 Hollywood, Acter, Hero Dwayne, Corona Positive, Family-TeluguStop.com

హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కరోనా పాగా వేసింది.ఇప్పటికే హాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలకు కరోనా సోకింది.

తాజాగా హీరో డ్వెయిన్ జాన్సన్ కు కరోనా సోకింది.అతడితో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వెలువరించాడు.

హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల జాబితాలో 48 ఏళ్ల డ్వెయిన్ జాన్సన్ కూడా ఉన్నారు.డ్వెయిన్ కు భార్య, ఇద్దరు పిల్లలు.అయితే కరోనా విపత్కర పరిస్థితిలో ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి తన కుటుంబానికి కరోనా సంక్రమించిందని డ్వెయిన్ వెల్లడించారు.ప్రస్తుతం తన ప్రధాన కర్తవ్యం తన కుటుంబాన్ని కాపాడుకోవడమేనని, సవాళ్లతో కూడుకున్నదని అన్నాడు.

అయితే సినిమాల్లోలాగా ఫైట్స్ చేస్తే కరోనా పోదని, దీని కోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని సూచించాడు.మాస్కులు ధరించడం, సామాజికదూరం పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయాలన్నారు.

సినీ పరిశ్రమలో అడుగు పెట్టకన్న ముందు డ్వెయిన్ జాన్సన్ వరల్డ్ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనే వాడు.అలా రెజ్లింగ్ లో పాపులర్ అయ్యాక హాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube