కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్ నిర్వాసితులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా తమ పంటలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని మహారాష్ట్ర రైతులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర రైతులు నిరసనకు దిగారు.పరిహారం చెల్లించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో నో ఎంట్రీ అంటూ హెచ్చరిస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేపట్టి తీరని నష్టం చేశారని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ కారణంగా గత నాలుగేళ్లుగా పంటలు వేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల్లో నోటిఫై చేసిన భూములకు ఇంతవరకు పరిహారం అందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసినా స్పందించలేదని మండిపడుతున్నారు.