వెండి తెర యముడు కైకాల.. ఎన్ని సినిమాల్లో ఆ పాత్రలో నటించాడో తెలుసా ?

కైకాల సత్యనారాయణ.తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుత నటుడిగా పేరు సంపాదించాడు.నవ రసాలను అవలీలగా పలికించగల నేర్పరి ఆయన.ఏ పాత్ర అయినా సరే అందులో జీవించేవాడు సత్యనారాయణ.విలనిజం, కరుణరసం, హాస్యం ఒకటేమిటీ అన్ని రసాలను అద్భుతంగా చేసేవాడు.అయితే ఆయా నటీనటులకు ఒక్కో సిగ్నేచర్ రోల్ ఉండటం కామన్.అలాగే తన జీవితంలో కూడా యముడి పాత్రను సిగ్నేచర్ రోల్ గా చేశాడు కైకాల.రాముడి, క్రిష్ణుడి పాత్రలు ఎన్టీఆర్ చేస్తే యముడి పాత్రలను మాత్రం ఆయనే చేసేవాడు.

 Kaikala Sathyanarayana Movies In Yama Role, Kaikala Sathyanarayana , Yama Role-TeluguStop.com

ఆ పాత్రకు తను తప్ప మరో వ్యక్తి సూట్ కాడని ఎన్నో సినిమాల్లో కైకాల నిరూపించాడు.ఆయన కెరీర్ లో పదుల సంఖ్యలో యముడి పాత్రలు చేశారు.

తెలుగులో పలు సినిమాల్లో కైకాల సత్యనారాయణ యముడి పాత్రలు చేశాడు.అందులో యమగోల, యముడికి మొగుడు, యమలీల చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి.1977లో తాతినేని రామారావు దర్శకత్వంలో తెరెక్కిన సినిమా యమగోల.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగింది.

అందులో నిజంగా యముడు అనేవాడు ఉంటే ఇలాగే ఉంటాడు అనేలా చేశాడు.ఆ తర్వాత ఆయనకు వరుసగా యముడి అవకాశాలు వచ్చాయి.

ఏ సినిమా అయినా సరే కైకాలే యముడిగా కనిపించేవాడు.యముండ అంటూ ఆయన గర్జించే గర్జన ఇప్పటికీ మరువలేనిది.

Telugu Chiranjeevi, Tollywood, Yama Gola, Yama Role, Yamaleea, Yamudiki Mogdu-La

అటు 19988లో వచ్చిన యముడికి మొగుడు అనే సినిమాలో కూడా ఆయన చేసిన యముడి క్యారెక్టర్ అద్భుతం అని చెప్పకోవచ్చు.ఆయుష్షు తీరకుండానే యమలోకానికి వెళ్లి చిరంజీవి యముడికి చుక్కలు చూపించే సన్నివేశాలు జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి.

Telugu Chiranjeevi, Tollywood, Yama Gola, Yama Role, Yamaleea, Yamudiki Mogdu-La

ఈ సినిమాలో కైకాల యముడి పాత్ర అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా కూడా ఓ రేంజిలో హిట్ అయ్యింది.అటు ఎస్వీ క్రిష్ణారెడ్డి తెరకెక్కించిన యమలీల కూడా ఓ రేంజిలో విజయాన్ని అందుకుంది.కమెడియన్ అలీతో కలిసి ఇండస్ట్రీలో కొత్త రికార్డులు నెలకొల్పాడు.ఇక పలు పౌరాణిక సినిమాల్లోనూ ఆయన మంచి క్యారెక్టర్లు చేశాడు.తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube