సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?

కెరీర్ తొలినాళ్ల నుంచే భారీస్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ కోసం 45 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకున్న తారక్ తర్వాత సినిమాలకు మాత్రం 55 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.

 Junior Ntr Investments Details Movie Money Interesting Facts Junior Ntr , Inve-TeluguStop.com

అయితే సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తారక్ భూములపై ఇన్వెస్ట్ చేస్తున్నారని సమాచారం.కొన్ని నెలల క్రితం తారక్ హైదరాబాద్ కు సమీపంలో భూములను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

తారక్ బళ్లారి, రైచూర్ ప్రాంతాలలో కూడా భూములను కొనుగోలు చేశారని ప్రముఖ నిర్మాత ఎన్టీఆర్ భూములు కొనుగోలు చేసే విషయంలో సహాయం చేశారని తెలుస్తోంది.హైదరాబాద్ లో ఎన్టీఆర్ కు ఖరీదైన బంగ్లా ఉందనే సంగతి తెలిసిందే.

ఈ బంగ్లా విలువ 30 కోట్ల రూపాయలు అని సమాచారం.

తారక్ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు, బైక్స్ ఉన్నాయి.

ప్రదేశాన్ని బట్టి తారక్ ఏ వాహనంలో వెళ్లాలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో తెరకెక్కే పలు సినిమాలలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ తారక్ తో జై లవకుశ అనే సినిమాను నిర్మించగా ఈ సినిమా భారీ మొత్తంలో లాభాలను అందించిందని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.

Telugu Hyderabad, Jai Lava Kusa, Ntr, Kalyan Ram, Koratala Shiva, Tollywood-Movi

ఈ సినిమాకు తారక్ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీకి కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నారు.ఈ సినిమాతో తారక్ మరో సక్సెస్ ను అందుకోవడం గ్యారంటీ అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ఈ సినిమా కూడా కళ్యాణ్ రామ్ కు భారీ లాభాలను అందించే అవకాశాలు ఉన్నాయి.జూన్ నెల మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube