సేవా కార్యక్రమం కోసం భారీ విరాళం ప్రకటించిన హీరో కార్తీ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్?

తమిళ హీరో కార్తీ( Hero Karthi ) గురించి మనందరికీ తెలిసిందే.తమిళంతో పాటు తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు కార్తీ.

 Japan Star Karthi Donates Rs 1 Crore Towards Welfare, Karthi,japan,food Donation-TeluguStop.com

తమిళంలో కార్తీ నటించిన సినిమాలు తెలుగులోకి కూడా విడుదల అయ్యాయి.ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు కార్తీ.

తానే స్వయంగా సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఒక ఫౌండేషన్ కూడా రన్ చేస్తున్నాడు.ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి చేయూతను అందిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా మరోసారి సేవా కార్యక్రమాల కోసం భారీగా విరాళాన్ని ప్రకటించి మంచి మనసును చాటుకున్నాడు.

Telugu Japan, Karthi, Kollywood, Crore, Tollywood, Welfare-Movie

తాజాగా తన కెరియర్లో 25వ సినిమాగా రూపోందుతున్న సందర్భంగా జపాన్ సినిమా తనకు మరింత స్పెషల్ అవ్వాలని ఒక ప్రత్యేకమైన పనిచేశాడు కార్తి.తాను చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలకు గాను దాదాపు కోటి రూపాయలకు పైగా విరాళం( One Crore Donation ) ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.కార్తీ 25వ సినిమాగా వస్తున్న జపాన్( Japan Movie ) ను దీపావళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టేశారు.అయితే కార్తి కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన జపాన్ సినిమాను మరింత స్పెషల్ చేసేందుకు కార్తీ ఏకంగా కోటి 25 లక్షలు సోషల్ ఆక్టివిటీస్ కోసం డొనేట్ చేశారు.

Telugu Japan, Karthi, Kollywood, Crore, Tollywood, Welfare-Movie

సామాజిక కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, పేదవారికి ఆహారం అందించడం కోసం ఈ భారీ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.25 రోజులు 25వేల మందికి అన్నదానం( Food Donation ) చేస్తున్నారు.అటు కార్తి కూడా తన కెరీర్లో జపాన్ 25వ చిత్రం కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి ఒక లక్ష, 25 పేద పాఠశాలలకు ఒక్కొక్కరికి ఒక లక్ష, 25 ఆస్పత్రులకు ఒక్కొక్కరికి ఒక లక్ష మిగిలిన మొత్తాన్ని 25 రోజులపాటు 25,000 మందికి ఆహారం అందించనున్నట్లు సమాచారం.వీటిలో ఇప్పటికే 25 వేల మందికి అన్నదానం చేయాలనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది.

ఇంత మంచి పనులు చేస్తున్న కార్తీ మనసుకు జోహార్లు అంటూ కామెంట్లు చేయడంతో పాటు కార్తీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube