జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా… ముందుకు వెళ్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే కొద్దిమంది పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు ప్రకటించిన జనసేనాని … ఇక ప్రజల్లోకి మరించ చొచ్చుకుపోయేందుకు మారుమూల పల్లెలకు కూడా జనసేన సిద్ధాంతాలు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నారు.
దీనిలో భాగంగానే… ఎక్కడా హంగూ ఆర్భాటం లేకుండా… భారీ ఎత్తున ప్రకటనలకు డబ్బులు ఖర్చుపెట్టకుండా… పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రచార రథాలను సిద్ధం చేసిన జనసేన.వాటిపై జనసేన సిద్ధాంతాలు, అధికారంలోకి చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించారు.
అలా సిద్దంచేసిన రథాలను గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.రథాలలను సిద్ధం చేసిన ఎన్నారైలను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు పవన్.ఈ రథాలు మంగళవారం నుంచి రోడ్ల మీద తిరుగుతూ… మారుమూల గ్రామాలను సైతం కవర్ చేసేలా ప్లాన్ చేశారు.