జనగామ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి,( Palakurti MLA Yashaswini Reddy ) జెడ్పీటీసీలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.
రైతుబంధు నగదును రైతుల ఖాతాల్లో ఇంకా వేయలేదంటూ యశస్విని రెడ్డిని జెడ్పీటీసీలు( ZPTCs ) అంతా కలిసి నిలదీశారు.దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి పడితే వారికే కాకుండా చెట్లకు, పుట్లకు కూడా ఇచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలో లెక్కలు సరి చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతుబంధు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు.అనంతరం సభా మర్యాద పాటించడం లేదంటూ జెడ్పీటీసీల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు.