కస్టడీలో హింసించారు.. భారతీయ పోలీసులపై సిక్కు ఎన్ఆర్ఐ ఆరోపణలు, మరోసారి తెరపైకి జోహాల్ కేసు

హత్యా నేరం కింద కస్టడీలో వున్నప్పుడు భారతీయ పోలీసులు తనను హింసించారని బ్రిటీష్ సంతతి సిక్కు వ్యక్తి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.ఈ మేరకు యూకే ప్రభుత్వం లండన్ హైకోర్టుకు తెలిపింది.

 Jagtar Singh Johal Case Foreign Office Asks For India Torture Claim To Be Heard-TeluguStop.com

ఈ కేసును రహస్యంగా విచారించనున్నారు అధికారులు.స్కాట్లాండ్‌లోని డంబార్టన్‌కు చెందిన 36 ఏళ్ల బ్రిటీష్ పౌరుడు జగ్తార్ సింగ్ జోహల్ ( Jagtar Singh Johal ).2017లో తన పెళ్లి కోసం పంజాబ్‌కు వచ్చినప్పుడు అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.అతనిని నాటి నుంచి న్యూఢిల్లీలోని తీహార్ జైలులో వుంచారు.

అయితే భారత్‌లోని పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జోహల్ ఆరోపించారు.

Telugu Commonwealth, Foreign, Indian, Johal, Delhi, Jaishankar-Telugu NRI

ఈ నేపథ్యంలో భారత అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు.అంతేకాదు అతనిని తీవ్రమైన అభియోగాల కారణంగానే అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఎంఐ5, ఎంఐ6లు భారత అధికారులతో గూఢచర్యాన్ని పంచుకోవడం ద్వారా తన నిర్బంధం, చిత్రహింసలకు దోహదపడి వుండవచ్చని జోహల్ ( Joel )చేస్తున్న వాదనకు యూకే కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థ రిప్రైవ్ మద్ధతు తెలిపింది.అయితే జోహల్‌ను అరెస్ట్ చేసిన తొలినాళ్లలో బ్రిటీష్ హైకమీషన్‌కు చెందిన కాన్సులర్ సిబ్బంది జైలులో జోహాల్‌ను సందర్శించారు.ఆ సమయంలో అతనికి ఎలాంటి గాయాలు లేవని చెప్పారు.

మరోవైపు లండన్‌లోని హైకోర్ట్.రహస్యంగా విచారణను కొనసాగించేందుకు మరో తేదీని నిర్ణయించలేదు.

Telugu Commonwealth, Foreign, Indian, Johal, Delhi, Jaishankar-Telugu NRI

జోహాల్‌ అరెస్ట్ , నిర్భందంపై గడిచిన కొన్నేళ్లుగా యూకే పార్లమెంట్‌లోనూ అక్కడి ఎంపీలు పలుమార్లు లేవనెత్తారు.ఈ జనవరి చివరిలో ఫారిన్, కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎఫ్‌సీడీవో)లోని పార్లమెంటరీ అండర్ సెక్రటరీ సైతం ఎంపీలకు ఈ విషయం గురించి తెలిపారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌( S Jaishankar )తో సమావేశాల సందర్భంగా జోహాల్ వ్యవహారం లేవనెత్తాలని సెక్రటరీ సూచించారు.కాగా.

భారతదేశంలో హత్యకు కుట్ర సహా తొమ్మిది ఆరోపణలను జోహాల్ ఎదుర్కొంటున్నాడు.దీనికి గాను అతనికి మరణశిక్ష పడే అవకాశం వుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఇతని వ్యవహారం భారత్- యూకే ప్రధానుల స్థాయిలో వుండటంతో .జోహాల్ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube