పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సినిమాలు సినిమాలే.రాజకీయాలు రాజకీయాలే.
అన్నట్టు వ్యవహరిస్తున్నారు.అటు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూనే ఇటు తాను లైన్లో పెట్టిన సినిమాల షూటింగులు సైతం ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు.
మరి పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న మూవీ ఏది అంటే ”ఓజి” ( OG )అనే చెప్పాలి.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.మొదటి 50 శాతం షూటింగ్ చాలా ఫాస్ట్ గా పూర్తి కాగా ఆ తర్వాత పవన్ రాజకీయ టూర్ నేపథ్యంలో వాయిదా పడింది.
ఇక ఈ మధ్యనే మళ్ళీ షూట్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు.
ఇప్పటికే వచ్చిన టీజర్ తో ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది.మరి ఈ సినిమా స్టోరీలో పవన్ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది.అనేది నెట్టింట వైరల్ అయ్యింది.వైరల్ అవుతున్న స్టోరీ ప్రకారం.ఓజాస్ గంభీర అనే టూరిస్ట్ సాధారణ వ్యక్తిగా ముంబై వచ్చి ఆ తర్వాత అనుకోని పరిస్థితిల్లో గ్యాంగ్ స్టర్ గా మారతాడట.ఈ క్రమంలోనే ఇతడు కుటుంబాన్ని సైతం కోల్పోతాడు అని టాక్.
దీంతో ఇతడు ఆ తర్వాత శత్రువులపై ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంటారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఈ స్టోరీ నిజమో కాదో తెలియదు కానీ సుజీత్ ( Director Sujeeth )మాత్రం పవర్ స్టార్ ను మామూలుగా చూపించడం లేదు.
పాత పవర్ స్టార్ ను ఫ్యాన్స్ కు గుర్తు చేస్తున్నాడు.యాక్షన్ బ్లాక్స్ తో థ్రిల్ చేసే విధంగా ఈ సినిమాను సుజీత్ తెరకెక్కిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్( Priyanka Mohan ) గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.