తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బండి సంజయ్ కీలక నేతగా ఎదిగారని బీజేపీ అంటోంది.ఇందుకు తగ్గట్టే ప్రజల్లో నిరూపించుకునేందుకు బండి సంయ్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుని నేషనల్ లీడర్ల కంట్లో పడాలని బాగానే ప్రయత్నించారు.
ఇందులో భాగంగానే జాగరణ దీక్ష పేరుతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.పోలీసులు అరెస్ట్ చేయడంతో నేషనల్ లీడర్లు వచ్చి ఆయనకు మద్దతు తెలపడంతో ఆయన ఇమేజ్ ఆసాంతం పెరిగిపోయింది.
బండికి జాతీయ నేతలు రావడంతో ఆయనకు కేంద్రంలో పలుకుబడి బాగానే ఉందనుకున్నారు.
కానీ మొన్న మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు మాత్రం ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇక్రిశాట్ వరకు అధికార పర్యటన అయితే.ముచ్చింతల్ లో సమతామూర్తి కార్యక్రమంలో పాల్గొన్న మోడీ.
అది మొత్తం ప్రయివేటు కార్యక్రమం కిందనే వచ్చారు.అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ కూడా వచ్చారు.
మొదటి నుంచి చివర దాకా ఆయన ఉన్నా కూడా.మోడీ ఆయన్ను దగ్గరకు పిలిచి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు.
ఎక్కడా ఆయన్ను ప్రశంసిస్తూ కుశల ప్రశ్నలు వేసిన ఘటనలు కూడా లేవు.
దీంతో అసలు మోడీ దగ్గర బండికి పెద్దగా మార్కులు లేవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఏదో పలకరించామా అంటే పలకరించాం అన్నట్టు మోడీ సంజయ్‌ను చూసి ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు తప్ప పెద్దగా ఏదైనా మాట్లాడారా అంటే అదీ లేదు.కనీసం రాష్ట్ర బీజేపీ గురించి ఏమైనా సలహాలు ఇచ్చారా అంటే అదీ లేదు.
ఇంత దూరం వచ్చిన ప్రధాని కనీసం రాష్ట్ర బీజేపీ నేతలతో ఎలాంటి కార్యక్రమాన్ని చేయలేదు.దీంతో అసలు సంజయ్‌ను మోడీ పట్టించుకోరంటూ బీజేపీలోనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.