తెలుగు సినిమా పరిశ్రమలో గోపీచంద్( Gopichand ) హీరోగా వరుస సినిమాలు చేస్తు తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.అయితే తను ఇపుడు శ్రీను వైట్ల ( Srinu Whitela )తో సినిమా చేస్తున్నాడు.
దానికి సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనే దాని పైన ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను సినిమా కోసం ఫిక్స్ చేయగా, ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాకి హ్యండిస్తు వాళ్ళు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పుడు మరో హీరోయిన్ కోసం ఎదురుచూపులు మొదలు పెట్టారు.
ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ని తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాలో కొత్త హీరోయిన్ తీసుకుంటారా లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్( Heroine ) ని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే మరి కొందరు మాత్రం గోపీచంద్ ని ఎందుకు ఈ సినిమా చేస్తున్నావ్.శ్రీను వైట్ల తో సినిమా చేస్తే మొదటి నుంచి ఏదో గోల ఉంటుంది.
సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇంకా చాలా మంది సినిమా నుంచి తప్పకుంటారు అలాగే సినిమా చాలా వివాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ గోపీచంద్ ను భయపెడుతున్నారు.
ఇక ఇలాంటి క్రమం లో గోపీచంద్ మాత్రం అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి కథని గోపి మోహన్( Gopi Mohan ) అందిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇంతకు ముందు ముందు శ్రీను వైట్ల చేసిన సినిమాలకి కథలను గోపి మోహన్ కోన వెంకట్( Kona Venkat ) కథలను అందించేవారు.
కానీ శ్రీను వైట్ల కి కొన వెంకట్ కి మధ్య జరిగిన కొన్ని గొడవల వల్ల కోన వెంకట్ శ్రీను నుంచి బయటికి వచ్చారు.కానీ గోపి మోహన్ మాత్రం శ్రీను వైట్ల తోనే ఉంటూ అతను చేసే సినిమాలు స్టోరీ లను అందిస్తూ ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు.