సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎంతో మంచి సఖ్యత ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా మంచి స్నేహితులుగా మెలగడమే కాకుండా మరొక హీరోలకు అభిమానులుగా ఉంటారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల కంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే ఈ హీరోలు నందమూరి హీరోలకు అభిమానులు అంటే నిజంగా అది ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన విషయమే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారికంటూ మంచి గుర్తింపు సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు.
ఈ విధంగా మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన వారిలో సాయి ధరంతేజ్ ఒకరు.ఈయన మెగా హీరో అయినప్పటికీ నందమూరి బాలకృష్ణకు అభిమాని అనే విషయం మనకు తెలిసిందే.ఈయన తన మామయ్య చిరు సినిమాలను ఎలా అయితే ఇష్టపడతారో బాలయ్య బాబు సినిమాలను కూడా అంతే ఇష్టపడతారు అదే విధంగా బాలకృష్ణ సినిమాలు విడుదల కాబోతున్నాయని తెలిస్తే ముందుగా ఈయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ తన అభిమానాన్ని చాటుకుంటారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ నటించిన ఆఖండ సినిమా విడుదలకు ముందు కూడా సాయిధరం చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు.అయితే తాజాగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకున్నారు.ఇలా మరోసారి బాలయ్య పట్ల సాయిధరమ్ తనకు ఉన్నటువంటి అభిమానాన్ని బయటపెట్టారు.
ఇక రేపు తన మామయ్య నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన బాలకృష్ణ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకోవడంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.