నందమూరి నరసింహ బాలకృష్ణ అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్నో అంచనాల నడుమ వీరసింహారెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ఉదయం నాలుగు గంటల నుంచి థియేటర్లలో అభిమానులను సందడి చేస్తుంది.
ఇక ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు వినూత్న రీతిలో బాలయ్య పై తమకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తిరుపతిలో ఓ థియేటర్ వద్ద మేకపోతును బలి ఇవ్వగా ప్రకాశం జిల్లాలో పొట్టేలు రక్తంతో బాలయ్య కటౌట్ కు అభిషేకం చేశారు.రాయలసీమలో ముఖ్యంగా అనంతపురంలో బాలయ్యకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇక్కడ ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.అనంతపురంలో కూడా అభిమానులు థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బాలయ్య అభిమానులు వీర సింహారెడ్డి సినిమా విడుదల మంచి సక్సెస్ అందుకున్న సందర్భంగా ఏకంగా ఆయన కటౌట్ కు అభిమానులు మ్యాన్సన్ హౌస్ మద్యంతో అభిషేకం చేస్తూ జై బాలయ్య అంటూ నినాదాలతో థియేటర్ ప్రాంగణం మొత్తాన్ని హోరెత్తిస్తున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా బాలయ్య అభిమానుల కోలాహలం కనిపించడంతో మరోసారి బాలయ్యకు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో బయటపడింది.మొత్తానికి బాలకృష్ణ సినిమా సక్సెస్ అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవదులు లేవు.







