ఫేస్ బుక్ పరిచయం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది.ఈ విచారకర ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వి.కోటకు చెందిన మురళీ అనే యువకుడు బెదిరింపులు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం.
మృతుడు మురళీకి ప్రియాశర్మ పేరుతో ఫేస్ బుక్ లో ఓ యువతి పరిచయమైంది.ఈ క్రమంలోనే ఇటీవల యువతితో యువకుడు వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడాడు.అనంతరం మురళీ వీడియోని మార్ఫింగ్ చేసిన ప్రియాశర్మ డబ్బులు ఇవ్వకుంటే యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని తెలుస్తోంది.దీంతో తాను ఓ కూలీనని, డబ్బులు ఇవ్వలేనంటూ వాట్సాప్ లో వేడుకున్నాడు.
అయినా యువతి బెదిరింపులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మురళీ రాత్రి బలవన్మరణం చెందాడని పోలీసులు తెలిపారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.