హలో బ్రదర్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం...

అక్కినేని నాగేశ్వర రావు ఎంత పెద్ద హీరో అనేది మన అందరికీ తెలిసిందే.ఇక నాగార్జున ( Nagarjuna ) నటించిన సినిమాలలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

 Interesting Facts About Akkineni Nagarjuna Hello Brother Movie Details, Nagarjun-TeluguStop.com

ఆయ‌న హీరోగా నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘హలో బ్రదర్’ సినిమా( Hello Brother Movie ) కూడా ఒకటి.ఈ మూవీలో నాగార్జున ద్విపాత్రాభినయం చేసి, ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు.

నాగార్జున హీరోగా 1993లో వచ్చిన వారసుడు చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.సినిమా విజయం సాధించడంతో నాగార్జున ఈవీవీ సత్యనారాయణతో ఇంకో మూవీ చేసేందుకు రెడీ అయ్యారు…

 Interesting Facts About Akkineni Nagarjuna Hello Brother Movie Details, Nagarjun-TeluguStop.com
Telugu Brother, Nagarjuna, Ramya Krishna, Soundarya, Twin Dragon-Movie

అయితే ఈవీవీ సత్యనారాయణ( EVV Satyanarayana ) ఈసారి సరికొత్త స్టోరీతో ఆడియెన్స్ ముందుకు వెళ్లాలని భావించారట.ఈ క్రమంలోనే ఈవీవీ తనకు బాగా నచ్చినటువంటి హాలీవుడ్ సినిమా ట్విన్ డ్రాగన్ స్టోరీని నాగార్జునకు చెప్పారంట.నాగార్జునకు కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అలా ‘హలో బ్రదర్’ సినిమా వచ్చింది.ఎల్బీ శ్రీరామ్ ఈ సినిమాకి డైలాగులు రాశారు.ఈ చిత్రంలో హీరోయిన్లు గా సౌందర్య, రమ్యకృష్ణలను ఎంపిక చేసుకున్నారు.

ఏ ఆటంకం లేకుండా చిత్రీకరణ పూర్తి చేశారు…అయితే కవలల కాన్సెప్ట్ తో అంతకుముందే చాలా చిత్రాలు వచ్చాయి.కానీ ఈ సినిమాలో ఇద్దరు ట్విన్స్ ఒకే లాగా ప్రవర్తించడం అనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

హలో బ్రదర్ మూవీ 1994లో ఏప్రిల్ 20న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.ఆ కాన్సెప్ట్ ఆడియెన్స్ కి బాగా న‌చ్చింది.

దాంతో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ క్ర‌మంలో ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది…

Telugu Brother, Nagarjuna, Ramya Krishna, Soundarya, Twin Dragon-Movie

ఇక ఈ చిత్రం (Hello Brother) ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో నూట ఇరవై షోలు హౌస్ ఫుల్ గా నడిచి, రికార్డు సృష్టించింది.ముప్పై రోజుల పాటు, రోజు నాలుగు షోలు హౌస్ ఫుల్ అయ్యింది.అలాగే ముప్పై కేంద్రాల్లో యాబై రోజులు, ఇరవై కేంద్రాలలో వంద రోజులు రన్ అయ్యి అప్పటి రికార్డుల‌ను తిరగరాసింది.ఈ సినిమాను రూ.2.50 కోట్ల బడ్జెట్ తో తీయగా, రూ.15.25 కోట్ల గ్రాస్‌ను, రూ.8.50 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసి రికార్డును క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యుత్త‌మ సినిమా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు…ఈ సినిమా ఇప్పుడు చూసిన కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube