మీ అపార్ట్‌మెంట్‌ స్థలానికి ఇన్సూరెన్స్‌ ఉందా?

హైదరాబాద్‌లాంటి మహానగరాలతోపాటు చిన్న నగరాలు, పట్టణాల్లోనూ ఇప్పుడు అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగిపోయింది.ఇండిపెండెంట్‌ ఇల్లు కొనే స్థోమత లేకనో లేక అపార్ట్‌మెంట్‌ అయితే భద్రత ఉంటుందన్న కారణమోగానీ.

 Insurance For Apartments Place-TeluguStop.com

చాలా మంది అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు.దీంతో ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా అపార్ట్‌మెంట్లు పుట్టుకొస్తున్నాయి.

Telugu Dream, Hyderabad Metro, Insurance Place, Peoples-

వాటిని కొన్నవాళ్లు తమ ఫ్లాట్లకు ఇన్సూరెన్స్‌ చేయించుకుంటున్నారు తప్ప అపార్ట్‌మెంట్‌ స్థలానికి అది ఉండటం లేదు.దీంతో భవిష్యత్తులో ఆ స్థలానికి సంబంధించి ఏదైనా వివాదం వస్తే.కొన్నవాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారు.ఈ మధ్య హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఇలాగే ఓ స్థలం వివాదాస్పదమైంది.ఆ భూమిని రియల్టర్‌కు అమ్మిన కుటుంబంలోని ఒకరు కోర్టుకెక్కారు.

దీంతో అప్పటి వరకూ అందులో ఫ్లాట్లు కొన్నవాళ్లు షాక్‌ తిన్నారు.

రియల్టర్‌ సంగతేమోగానీ.ఆ వివాదాస్పద స్థలంలో ఫ్లాట్లు కొన్న వాళ్లు వీటి కారణంగా ఇబ్బందుల్లో పడుతున్నారు.

కోర్టులో ఒకవేళ రియల్టర్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే.అది ఫ్లాట్లు కొన్నవాళ్లందరిపైనా ప్రభావం చూపుతుంది.

ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.అపార్ట్‌మెంట్‌ స్థలం కొనుగోలు సమయంలోనే ఇన్సూరెన్స్‌ చేయించాల్సిందేనని స్పష్టం చేసింది.

నిజానికి గతంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.దీంతో తాజాగా మరోసారి దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి నివేదిక ఇవ్వాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీని కేంద్రం ఆదేశించింది.

దీనికోసం రెండు నెలల సమయం సమయమిస్తూ ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.కేంద్రం ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తే.భవిష్యత్తులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు స్థల వివాదాలు వచ్చినా కూడా నిశ్చింతగా ఉండొచ్చు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube