భారత దేశం నుంచీ ఎంతో మంది భారతీయులు పొట్ట కూటి కోసం పరాయి దేశాలు వెళ్లి అక్కడ తినీ తినకా , ఎంతో కష్టపడుతూ భారత్ లోని తమ వాళ్లకి డబ్బులు పంపుతూ ఉంటారు.ఒక పక్క కుటుంభానికి దూరంగా ఉంటూనే వారి వారి చదువులకి తగ్గట్టుగా వివిధ ఉద్యోగాలని నిర్వర్తిస్తూ ఉంటారు.
కుటుంబానికి దూరంగా ఉంటూ ఏళ్ళ తరబడిగా సంపాదిస్తూ ఒక్క సారిగా ఆ కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యిపొతే ఆ ఘటన తలుచుకోవడానికే హృదయ విదారకంగా ఉంటుంది.ఇలాంటి సంఘటనే ఇప్పుడు దుబాయ్ లో చోటు చేసుకుంది.
వివరాలోకి వెళ్తే.
దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవాస భారతీయుడు దుర్మరణం పాలయ్యారు అతని పేరు షేక్ మహ్మద్ బిన్ జయేద్ ఓ ప్రముఖ వార్తా పత్రికలో సేల్స్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
రోజులాగానే విధులు నిర్వహిస్తూ తన వాహనంపై న్యూస్ పేపర్ కోసం వెళ్తున్న సమయంలో ఒక్క సారిగా ఎదురుగా వచ్చిన ట్రక్ డీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అయితే న్యూస్ పేపర్ లు తీసుకుని ఎంతకీ షేక్ మహ్మద్ బిన్ రాకపోవడంతో అతని కోసం వెళ్ళిన తన స్నేహితుడికి మహ్మద్ చనిపోయి కనిపించడంతో అతడు పోలీసులకి ఫిర్యాదు చేశారు.అలాగే అతడి మరణ వార్తని కేరళలో ఉన్న ఆయన కుటుంభ సభ్యులకి తెలియచేశారు.అతడికి భార్య కుమారుడు, కూతురు ఉన్నట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే అతడి మృతదేహాన్ని కేరళా పంపే ఏర్పాట్లు చెస్తున్నట్లుగా స్థానిక ప్రవాస సామాజిక కార్యకర్త తెలిపారు.