భారతదేశంలో తొలి సముద్ర గర్భ రైల్వే ట్రాక్.. ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే..?

ప్రపంచం సూపర్ ఫాస్ట్ గా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది.ప్రస్తుతం ప్రయాణాలు ఎంత దూరమైన సౌకర్యవంతంగా ఉంటున్నాయి.

 India's First Undersea Railway Track Where Will It Be Established , Railway Line-TeluguStop.com

అంతేకాదు ప్రయాణం మార్గ సమయం కూడా దాదాపుగా తగ్గుతూనే వస్తోంది.గాలిలో ప్రయాణించడానికి విమానాలు, నీటిలో ప్రయాణించడానికి ఓడలు, ఇక భూమిపై ప్రయాణించడానికి ఎన్ని రకాల వాహనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

ముఖ్యంగా రైలు మార్గాల( Railway lines ) గురించి చర్చించుకుంటే ఇప్పటివరకు కొండలు, గుట్టల నుంచి ఎన్నో రైల్వే మార్గాలు ఉండడం అందరికీ తెలిసిందే.కానీ టెక్నాలజీ మరో అడుగు ముందుకు వేసి సముద్ర గర్భంలో నుంచి రైలు ప్రయాణించే టన్నెల్ భారతదేశంలో( India ) తొలిసారిగా ఏర్పాటు అవ్వనుంది.

ఆ టన్నెల్ కు సంబంధించిన ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.

Telugu Bandrakurla, General, India, Latest Telugu, Railway, Railway Track, Tunne

భారతదేశంలో తొలిసారిగా ముంబై- అహ్మదాబాద్ ( Mumbai-Ahmedabad )మధ్య హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణం కొనసాగుతోంది.ఈ మార్గంలో 21 కిలోమీటర్లు సొరంగ మార్గం ద్వారా రైలు ప్రయాణించనుంది.ఇందులో ఏడు కిలోమీటర్లు సముద్ర గర్భంలో టన్నెల్ ఏర్పాటు అవ్వనుంది.

ఈ టన్నెల్ మహారాష్ట్ర పరిధిలో నిర్మిస్తున్నారు.

Telugu Bandrakurla, General, India, Latest Telugu, Railway, Railway Track, Tunne

బాంద్రా- కుర్లా కాంప్లెక్స్( Bandra-Kurla Complex ) మధ్య ఈ టన్నెల్ ను తవ్వనున్నారు.థానే జిల్లాలోని శిల్ ఫాటా ప్రాంతంలో సముద్ర గర్భ టన్నెల్ నిర్మించనున్నారు.ఇక్కడ అప్ అండ్ డౌన్ రెండువైపులా పట్టాలు నిర్మించనున్నారు.

అంటే ఒకేసారి రెండు ట్రైన్ లు టన్నెల్ గుండా వేర్వేరు ట్రాక్ల ద్వారా ప్రయాణిస్తాయి.ఈ టన్నెల్ భూమిలో 20 నుంచి 65 కిలోమీటర్ల లోతులో నిర్మాణం అవ్వనుంది.

నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్- ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ బిడ్ల కు ఆహ్వానించింది.ఆఫ్కాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ ఈ టన్నెల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది.

పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి.అతి త్వరలోనే భారతదేశంలో సముద్ర గర్భంలో రైలు ప్రయాణించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube