ఉపాధికోసం సౌదీ వెళ్ళిన వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి వారినే నమ్ముకుని ఉన్న కుటుంభాలలో తీరని శోకాన్ని మిగిల్చాయి.ఎన్నో ఆశలతో కుటుంభాన్ని జాగ్రత్తా కాపాడుకోవాలని అనుకున్న వారి జీవితాలు, వారి కలలు మధ్యలోనే బూడిద అయిపోయాయి.
సౌదీలో జరిగిన ఒక దుర్ఘటన నిజామాబాద్ లోని వారి కుటుంబాలలో తీర్చలేని విషాదాన్ని నింపి వెళ్ళింది.వివరాలలోకి వెళ్తే.
సౌదీ అరేబియాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు సజీవ దహనమయ్యారు…నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన బొంత దేవిదాస్, నిజామాబాద్ నగరానికి చెందిన సయ్యద్ సత్తార్‌లు సౌదీలోని ఓ కంపెనీలో పని నిమ్మిత్తం చేరారు అయితే మధ్యాహ్న సమయంలో భోజనం అనంతరం కార్మికులంతా గదిలో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
దాంతో వారు నిద్రకి ఉపక్రమించిన ప్రాంతంలోనే పలు రకాల రసాయనాలు కూడా ఉండడంతో కంపెనీ మొత్తం మంటలు వ్యాపించాయి…అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ ఇద్దరు కార్మికులు సజీవ దహనం అయ్యారు.దీంతో వారి రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.