చరణ్‌ మూవీలో కౌశల్‌ను చేయవద్దంటున్న కౌశల్‌ ఆర్మీ.. ఎందుకో తెలుసా?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత కౌశల్‌ బయటకు వచ్చిన తర్వాత కూడా సందడి కొనసాగిస్తూనే ఉన్నాడు.ఆదివారం ఎపిసోడ్‌లో కౌశల్‌ను విజేతగా ప్రకటించిన తర్వాత, అదే రాత్రి సమయంలో అన్నపూర్ణ స్టూడియో ముందు భారీ ఎత్తున కౌశల్‌ ఆర్మీ కౌశల్‌కు ఘన స్వాగతం పలకడంతో పాటు, వెంటనే సన్మానం కూడా నిర్వహించారు.

 Kaushal Army Oppose Movie With Ram Charan-TeluguStop.com

ఆ తర్వాత వరుసగా ఇంటర్వ్యూల్లో కౌశల్‌ పాల్గొంటున్నాడు.కౌశల్‌ ఫ్యాన్స్‌ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ మీ అందరి కోసం నేను సినిమాలు చేస్తాను, హీరోగా నటిస్తాను అన్నాడు.

తాజాగా కౌశల్‌కు మెగా మూవీలో ఛాన్స్‌ వచ్చిందని, చరణ్‌తో బోయపాటి తెరకెక్కిస్తున్న మూవీలో కౌశల్‌ నటించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.బోయపాటి త్వరలోనే కౌశల్‌తో షూటింగ్‌ కూడా చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో కౌశల్‌ ఆర్మీ స్పందించింది.కౌశల్‌ సోలో హీరోగా సినిమా చేయాలని కోరుకుంటున్నాం.కౌశల్‌ కోసం క్రౌండ్‌ ఫండ్డింగ్‌ మూవీని ప్లాన్‌ చేద్దాం అంటూ ఆర్మీ సభ్యులు పిలుపునిచ్చారు.తెలుగులో క్రౌడ్‌ ఫడ్డింగ్‌ మూవీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి.అంటే ఎక్కువ మంది కలిసి సినిమాను నిర్మించడంను క్రౌండ్‌ ఫడ్డింగ్‌ మూవీస్‌ అంటారు.

కౌశల్‌ ఆర్మీ సభ్యులు దాదాపు అయిదు వందల మంది కలిసి కౌశల్‌ కోసం 4 కోట్ల రూపాయలు జమ చేయాలని భావిస్తున్నారు.ఆ నాలుగు కోట్లతో కౌశల్‌ హీరోగా సినిమా చేయాలని వారు నిర్ణయించుకున్నారు.కౌశల్‌ ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సినీ జనాల్లో చర్చకు తెరలేపింది.ప్రస్తుతం కౌశల్‌ కోసం యువ దర్శకులు పలువురు కథలు సిద్దం చేస్తున్నారు.త్వరలోనే సినిమాను ప్రారంభించేందుకు కౌశల్‌ కూడా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కౌశల్‌ హీరోగా సినిమా అంటే ప్రేక్షకులు ఎలా ఫీల్‌ అవుతారా అనేది ఆసక్తికరంగా ఉంది.

కౌశల్‌ ఆర్మీ ఎలాగూ సినిమా చూస్తారు.సాదారణ ప్రేక్షకులు ఎలా రియాక్ట్‌ అవుతారు, కౌశల్‌ను హీరోగా రిసీవ్‌ చేసుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది.

మంచి కథతో వస్తే తప్పకుండా మంచి విజయాలను దక్కించుకోవచ్చు అనేది అందరి అభిప్రాయం.అందుకే ఆలస్యం అయినా కౌశల్‌ మంచి స్క్రిప్ట్‌తో రావాలని అభిమానులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube