అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని యూఎస్ పౌరసత్వంకోసం భారతీయులు క్యూ కడుతున్నారని ఓ సర్వేలో తేలింది.ఒక పక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసవాసులపై అనుసరిస్తున్న కటినమైన వైఖరులు ఉన్నా సరే అమెరికా రావాలనుకునే వారి సంఖ్య పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు.ది యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదికలో భాగంగా…
2018 లో అమెరికా పౌరసత్వం తీసుకున్న వారిలో మెక్సికో కంటే కూడా భారతీయులే అత్యధికంగా ఉన్నారని ఈ సర్వే తెలిపింది.2017 తో పోల్చితే ఇది 2.7 శాతం పెరిగిందని ప్రకటించింది.2019 తో పోల్చితే అమెరికా మొత్తంగా 8.34 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చింది.ఇది పదకొండేళ్ళలో అత్యధికం అవ్వగా 2018 తో పోల్చితే 9.5 శాతం ఎక్కువగా నమోదయ్యింది.ఇక 2018లో 7,61,901.
మంది కి అమెరికా పౌరసత్వం ఇవ్వగా అందులో అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికో నుంచే దాదాపు 1,31,977మంది ఉన్నారు.
ఆ తరువాతి స్థానంలో భారత్ ఉండగా…మూడవ స్థానంలో చైనా నిలిచింది.ఇలా భారత్ నుంచీ పౌరసత్వం పొందిన వారిలో 6.9 శాతం మంది ఉన్నారని నివేదించింది.ఇక అమెరికాకి వలసలు వచ్చిన ఈ 8 లక్షల మందిలో అందరూ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేయనున్నట్టుగా తెలుస్తోంది.అంతేకాదు గ్రీన్ కార్డ్ పొందే దేశాలలో సైతం భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.