డిసెంబర్ 31 దాటితే కొత్త సంవసత్సరం లోకి అడుగుపెడుతాము.కానీ భారతీయ సాంప్రదాయాల ప్రకారం ఉగాది రోజునే మనకి సంవసత్సరం మారుతుంది.
యుగము మొదలైన రోజు చైత్ర శుక్ల పాడ్యమి రోజు కావడం, ఉగాది రోజునే సృష్టి జరిగడంతో భారతీయులకి సంవసత్సరాది ఉగాదే.ఈ పండుగని తెలుగువారందరూ ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటారు.
వివిధ దేశాలలో ఉండే తెలుగు ఎన్నారైలు సైతం ఉగాది పర్వదినాన్ని తప్పకుండా నిర్వహించుకుంటారు.
ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ఉన్న తెలుగు ఎన్నారైలు ఉగాది కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.
న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పేరుతో అక్కడ తెలుగు ఎన్నారైలు సంస్థని ఏర్పాటు చేసుకుని తెలుగువారందరికీ అందుబాటులో ఉండేలా సేవలు అందిస్తున్నారు.తెలుగు పండుగలు, సంస్కృతీ సాంప్రదాయల నిర్వహణ, తోటి తెలుగువారికి సాయం అందించడం ఇలా ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు.
ఈ కోవలోనే మార్చ్ నెలలో ఉగాది వేడుకలని ఏర్పాటు చేశారు.
మార్చి 28 -2020 న ఉగాది వేడుకలని ఆక్లాండ్ లో మహాత్మా గాంధీ సెంటర్ 145 న్యూ నార్త్ రోడ్ ఈడెన్ టెర్రస్ నందు సాయంత్రం 3 గంటలకి ఈ వేడుకలని ప్రారంభించనున్నారు.
ఈ వేడుకలకి తెలుగు సినిమా గాయకులు అయిన సింగర్ మల్లికార్జున రావు, గోపిక పూర్ణిమా ఇద్దరూ ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారని ఓ ప్రకటనలో తెలిపారు.