తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన “దేవదాస్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై తన జీరో సైజు నడుముతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసిన గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదని అనిపించడంతో ఏకంగా పవన్ కళ్యాణ్ జూనియర్, జూ.
ఎన్టీఆర్, రవితేజ, నితిన్ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. దీంతో ఒకప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.
అయితే టాలీవుడ్ లో వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ పై మోజు కలగడంతో ఏమి ఆలోచించకుండా వెంటనే మూటా ముల్లె సర్దుకుని ముంబైకి చెక్కేసింది.అయితే బాలీవుడ్ కి వచ్చిన కొత్తలో కొంతమేర అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
దీంతో కొంత కాలం పాటు సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా గడిపింది.అయితే ఈ ఖాళీ సమయంలో లో బరువు బాగా పెరిగింది.
దీంతో కొత్త సినిమా అవకాశాలు సంగతి అటుంచితే బరువు బాగా పెరగడంతో కొందరు దర్శక నిర్మాతలు అవకాశాల విషయంలో కొంతమేర మొహం చాటేశారు.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే ఇలియానా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫోటోని షేర్ చేసింది.
ఈ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో కరోనా కారణంగా తాను తీవ్రంగా బాధ పడ్డానని చెప్పకనే చెబుతోంది. అంతేగాక ప్రస్తుతం తన బరువు తగ్గే పనిలో భాగంగా ఎక్కువ శాతం జిమ్ వర్కౌట్లు మరియు వ్యాయామం యోగా వంటి వాటి ని చేస్తూ గడుపుతోంది.
ఈ క్రమంలో ఈ అమ్మడు మళ్లీ జీరో సైజు లోకి వచ్చినట్లు సమాచారం.