మార్చి 26వ తేదీన ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతుంది.
మరో 20 రోజుల్లో జరగనున్న ఈ టోర్నీలో తమ సత్తా చాటేందుకు అన్ని జట్లు సిద్ధమయ్యాయి.
ముఖ్యంగా ధోనీ ఈసారి తన విశ్వరూపం చూపించి మళ్లీ సీఎస్కే జట్టును గెలిపించాలని కృషి చేస్తున్నాడు.40 ఏళ్ల వయస్సులోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ కనబరచడానికి మిస్టర్ కూల్ అద్భుతమైన ఫిట్నెస్ సాధించాడు.కండలు తిరిగిన దేహంతో అతడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.
తాజాగా కండలు చూపిస్తున్న ధోనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.ఈ వయసులోనూ కుర్రాడి లాగా బాడీని మెయింటైన్ చేస్తున్న ధోనీ ని చూసి వావ్ అంటున్నారు.
ఎంఎస్ ధోనీ ఫ్యాన్ క్లబ్ హైదరాబాద్ అనే ఒక ట్విట్టర్ పేజీ ధోనీ తన ఐపీఎల్ టీమ్ మెంబర్స్ తో కలిసి మాట్లాడుతున్న వీడియోని షేర్ చేసింది.“ధోని ఫిట్నెస్ గోల్స్ పెంచుతున్నాడు.ఆ బైసిప్స్ చూడండి, చూస్తే మతిపోవాల్సిందే” అని ఈ వీడియో కి ఒక క్యాప్షన్ జోడించింది.
అలాగే దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈసారి లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా ఐపీఎల్ లో చేరాయి.
దీనివల్ల ఈసారి మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.ఇందులో 70 లీగ్ మ్యాచ్‌లు ఉంటే 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఉంటాయి.
ఈ మ్యాచ్‌లన్నీ నాలుగు స్టేడియంలలో జరుగుతాయి.అవి వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, డీవై పటేల్ స్టేడియం, మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియం.