కొబ్బరి తోటలలో అంతర పంటలను సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.కొబ్బరి తోటలను సాగు చేసే రైతులు( Farmers ) పంట చేతికి వచ్చేవరకు పెట్టుబడి భారం అధికంగా పెరుగుతుంది.
మరి కొబ్బరి తోటల్లో ( Coconut Cultivation )అంతర పంటలను వేస్తే అదనపు ఆదాయం పెరిగి రైతులు అప్పులు అనేవి ఉండవు.అయితే అనవసర పంటలను అంతర పంటలుగా సాగు చేయకూడదు.
పసుపు, మిరియాలు, అల్లం, వక్క లాంటి పంటలను అంతర పంటలుగా సాగు చేస్తే ఏడాదిలో రెండు లక్షలకు పైగా ఆదాయం పొందవచ్చు.ఒక పంటపైనే ఆధారపడకుండా రెండు లేదా మూడు రకాల పంటలను వేసి సాగు చేస్తే ఒక పంటలో నష్టం వచ్చిన మరొక పంట ఆదాయాన్ని ఇస్తుంది.
అంతర పంటల మధ్య సేద్యం కల్పతరువుగా మారింది.
వ్యవసాయం( Agriculture ) చేసే రైతులు ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా వివిధ రకాల పంటలను సాగు చేస్తే
చీడపీడల, తెగుళ్ల బెడద
ఉండదు.వీటి బెడద ఉండకపోతే రసాయనిక ఎరువుల( Chemical fertilizers ) ఖర్చు తగ్గుతుంది.దీంతో పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు శ్రమ తగ్గడం వల్ల రైతుకు మంచి ఆదాయాలు వస్తాయి.
కాబట్టి కొబ్బరి తోటలలో వేసే అంతర పంట మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య గాలి మరియు సూర్యరశ్మి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా నాటుకొని సాగు చేయాలి.ఈ అంతర పంటలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి, సంరక్షించుకుంటే కొబ్బరి పంటకు కావలసిన పెట్టుబడి వ్యయం మొత్తం ఈ పంటల నుండే తీయవచ్చు.వ్యవసాయంలో మారుతున్న పద్ధతులను రైతులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకుని సరికొత్త పద్ధతులను పాటిస్తేనే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.