ఈ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్.. అయ్యింటే బాక్సాఫీస్ బద్దలే !

సాధారణంగా సినిమా అంటే వినోదం మాత్రమే కాదు.అదొక ఎమోషన్.

 If These Movies Are Released In Theaters, The Box Office Will Be Broken, Gr Gopi-TeluguStop.com

సినిమాలోని పాత్రలతో మనల్ని మనం ఊహించుకుంటూ మనకు తెలియకుండానే ఆ పాత్రలలో లీనమైపోతాము.సినిమాలో జరిగే ప్రతి సన్నివేశం కూడా మనకే జరుగుతున్నట్లుగా భావిస్తాము.

అలా ప్రేక్షకులను మూవీతో పాటు ప్రయాణించేలా చేసి అద్భుతమైన విజయాలను అందుకుంటూ ఉంటారు మేకర్స్.ముఖ్యంగా ఒక సినిమాకు థియేటర్ ఇచ్చే అనుభూతి.

ఇంకేది ఇవ్వలేదనే చెప్పాలి.హీరో డాన్స్ చేసే విజిల్స్, ఫైట్స్ చేస్తే క్లాప్స్.

కామిడీ చేస్తే నవ్వులు, ఏడిస్తే హీరోతో పాటు మనం కన్నీళ్లు కార్చడం.అబ్బో ఇలా థియేటర్ మూవీ ఇచ్చే అనుభూతి గురించి ఎంత చెప్పిన తక్కువే.

అయితే ఈ మద్యకాలంలో కరోనా కరోనా కారణంగా థియేటర్ మునుపటి కల తప్పిందనే చెప్పాలి.ఈ సమయంలో ఓటిటీ ఫ్లాట్ ఫామ్ రావడం.

ఇక కరోనా తరువాత కూడా ప్రేక్షకులు ఓటిటీ వైపే చూస్తుండడంతో థియేటర్స్ ఇచ్చే అనుభూతి కాస్త మిస్ అవుతున్నామనే చెప్పాలి.అయితే కరోనా సమయంలో ఓటిటీ లో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే వాటి ఇంపాక్ట్ డబుల్ అయిండేదనే చెప్పాలి.అలాంటి థియేటర్స్ అనుభూతిని మిస్ చేసి ఓటిటీలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక అయిదు మూవీస్ గురించి మాట్లాడుకుందాం.

1.ఆకాశమేనీ హద్దు తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.సుధా కొంగర ధర్శకత్వం వహించిన ఈ మూవీకి జాతీయ అవార్డ్ కూడా వరించింది.

సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని అందించాలని కలలుగన్న జి‌ఆర్ గోపినాథ్ జీవిత కథతో రూపొందిన ఈ మూవీలో సూర్య నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయి ఉంటే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేది.

2.జైబీమ్ సూర్య నటించిన ఈ మూవీ కూడా ఓటిటీలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.

టి‌జే జ్ఞాన్ వెల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సామాజిక అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో సాగుతుంది.దళితుల అన్యాయంపై ప్రశ్నించే పాత్రలో సూర్య నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది.

అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ.ఒకవేళ థియేటర్ లో రిలీజ్ అయి ఉంటే సూర్య కెరియర్ లోనే మెమరబుల్ మూవీ గా నిలిచేది.

Telugu Drushyam, Grgopinath, Jai Bheem, Ppa, Surya, Telugu-General-Telugu

3.కలర్ ఫోటో షార్ట్ ఫిల్మ్స్ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, వెండితెరపై విభిన్న పాత్రలతో నటించి మెప్పిస్తున్నా సుహాస్ హీరో గా వచ్చిన ఈ మూవీ ఓటిటీలో విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచింది.అంతే కాకుండా జాతీయ అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది.ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి ఉంటే సుహాస్ కెరియర్ కి హీరోగా మంచి టర్నింగ్ పాయింట్ మూవీగా నిలిచేది.

Telugu Drushyam, Grgopinath, Jai Bheem, Ppa, Surya, Telugu-General-Telugu

4.నారప్ప విక్టరీ వెంకటేష్ నటించిన ఈ మూవీ.తమిళ్ ” అసురన్ ” మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వచించిన ఈ మూవీ ఓటిటీలో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది.

తన కుటుంబం కోసం తపించే పాత్రలో విక్టరీ వెంకటేష్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ అయింటే ప్రేక్షకుల సరికొత్త వెంకటేష్ ను పరిచయం చేసేది.

5.దృశ్యం 2 వెంకటేష్ నటించిన ఈ మూవీ కూడా ఓటిటీలోనే రిలీజ్ అయింది.

దృశ్యం మూవీకి సిక్వల్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో హిట్ గా నిలిచింది.ఒకవేళ థియేటర్ లో రిలీజ్ అయింటే వెంకటేష్ కు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube