వన్డే వరల్డ్ కప్ 2023( World Cup 2023 ) టోర్నీ టైటిల్ ఆస్ట్రేలియా గెలిచి, క్రికెట్ అభిమానులతో పాటు భారతీయులందరినీ బాధకు గురిచేసింది.ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ప్రపంచ కప్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది.
క్రికెట్ అభిమానులు ఈ ప్రపంచకప్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు.తాజాగా జరిగిన టోర్నీలో లీగ్ దశ నుంచే అద్భుత ఆటను కనపర్చిన భారత్ టైటిల్ గెలిచి ఉంటే సంబరాలు ఆకాశాన్ని అంటేవి.
కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చివరికి నిరాశే మిగిలింది.
ప్రపంచ కప్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.1975లో వరల్డ్ కప్ ఇంగ్లాండ్( England ) వేదికగా ప్రారంభమైంది.తొలి ప్రపంచ కప్ ను వెస్టిండీస్ గెలిచింది.
ఫ్రుడెన్షియల్ అనే ఒక బీమా కంపెనీ ప్రపంచ కప్ ను స్పాన్సర్ చేయడం ద్వారా తోలి వరల్డ్ కప్ కు ఫ్రుడెన్షియల్ వరల్డ్ కప్ అని నామకరణం చేశారు.ఈ ప్రపంచ కప్ ట్రోఫీ( World Cup Trophy ) బంగారం, వెండితో రూపొందించబడింది.
కప్ లోపల వెండి, కప్ పై భాగంలో బంగారు పూత పూశారు.ఫ్రుడెన్షియల్ బీమా కంపెనీ 1975, 1979, 1983 లలో జరిగిన ప్రపంచ కప్ లలో కప్ ను స్పాన్సర్ చేసింది.
1996 తర్వాత ఐసీసీ ఈ ప్రపంచ కప్ ట్రోఫీ తయారీ బాధ్యతను లండన్ లోని గారార్డ్ అనే జ్యువెలరీ సంస్థకు అప్పగించింది.వరల్డ్ కప్ ట్రోఫీ 60 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండి, 11 కిలోల బరువుతో ఉంటుంది.ఈ ట్రోఫీ మొత్తం వెండితో తయారు చేయబడి, పైన బంగారు పూత( Gold Coating ) పూసి ఉంటుంది.ట్రోఫీ పైన ఒక గ్లోబ్ ఉంటుంది.ఈ గ్లోబ్ మొత్తం బంగారు తో పూత పూయబడి ఉంటుంది.ఈ గ్లోబ్ కు సపోర్ట్ గా మూడు సిల్వర్ కాలమ్స్ ఉంటాయి.
ఈ కాలమ్స్ స్టంప్స్, బెయిల్స్ ఆకారంలో నిలువు వరుసలో ఉంటాయి.గుండ్రంగా ఉండే ఈ గ్లోబ్ క్రికెట్ బంతిని సూచిస్తుంది.
ఈ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటంటే ఏ కోణంలో నుంచి చూసిన ట్రోఫీ ఒకేలా ఉంటుంది.ఈ ట్రోఫీ తయారీకి సుమారుగా రెండు నెలల సమయం పడుతుంది.ఈ ట్రోఫీ తయారీకి అయ్యే ఖర్చు సుమారుగా రూ.31 లక్షలు. ట్రోఫీ గెలిచిన జట్టు పేరును ట్రోఫీ కింది భాగంలో ముద్రిస్తారు.ట్రోఫీ గెలిచిన జట్టుకు నకిలీ ట్రోఫీ అందజేసి, అసలు ట్రోఫీని దుబాయ్ లోని ఐసీసీ( ICC ) ప్రధాన కార్యాలయంలో ఉంచుతారు.