సినిమాలపై ఆసక్తితో ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తెలుగోడు.. డైరెక్టర్ గా ఏ స్థాయికి ఎదిగాడంటే?

సాధారణంగా ఐఏఎస్ ఉద్యోగం( IAS job ) సాధించడానికి ఏ స్థాయిలో కష్టపడాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకసారి ఈ ఉద్యోగం సాధిస్తే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.

 Ias Paparao Biyyala Career Success Story Details Here Goes Viral In Social Media-TeluguStop.com

పాపారావు బియ్యాల అనే వ్యక్తి ఐఏఎస్ పోస్టింగ్ వచ్చిన చోట సమర్థవంతంగా పని చేసి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆయన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై దృష్టి పెట్టారు.1954 సంవత్సరంలో జన్మించిన పాపారావు బియ్యాల ఉస్మానియా యూనివర్సిటీ ( Osmania University )నుంచి ఎల్.ఎల్.బీ పట్టా అందుకున్నారు.1982లో ఐఏఎస్ సాధించిన పాపారావు బియ్యాల అస్సాంలో డిప్యూటీ కమిషనర్ గా, రాష్ట్ర హోం సెక్రటరీగా పని చేశారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ ఇండియాలో ఐదు సంవత్సరాల పాటు పాపారావు బియ్యాల( paparao biyyala ) పని చేయడం గమనార్హం.క్లీన్ స్పోర్ట్స్ ఇండియా అనే స్వచ్చంద సంస్థను సైతం పాపారావు బియ్యాల ఏర్పాటు చేశారు.

Telugu Deputy, Ias Job, Music School, Osmania, Paparao Biyyala, Tollywood-Movie

1996 సంవత్సరంలో పాపారావు బియ్యాల ఫిల్మ్ అకాడమీలో 3 నెలల కోర్స్ చేశారు.ఆ తర్వాత విల్లింగ్ టు సాక్రిఫైస్ అనే డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింను తీశారు.ఈ షార్ట్ ఫిల్మ్ కు ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రంగా జాతీయ అవార్డ్ వచ్చింది.ఈ అవార్డ్ వచ్చిన తర్వాత సంతోషంతో వెంటనే సినిమాలు చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.

చాలా గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మ్యూజిక్ స్కూల్ సినిమాతో( Music School Movie ) పాపారావు బియ్యాల రీఎంట్రీ ఇచ్చారు.

Telugu Deputy, Ias Job, Music School, Osmania, Paparao Biyyala, Tollywood-Movie

పాపారావు బియ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.రాబోయే రోజుల్లో ఈ డైరెక్టర్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.పాపారావు బియ్యాల కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

పాపారావు బియ్యాల కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube