హైదరాబాద్ పంజాగుట్టలో కిడ్నాప్ ఘటనను పోలీసులు ఛేదించారు.ఈ కేసులో బాధితుడి బావమరిదే సూత్రధారిగా గుర్తించారు.
బాధితుడు మురళి బావమరిది రాజేశ్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.గత నెల 27వ తేదీన అమీర్ పేటలో బీవీ మురళీ అనే వ్యక్తిని ఐటీ అధికారుల పేరుతో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రూ.30 లక్షలు వసూలు చేసి మురళీని కిడ్నాపర్లు విడిచిపెట్టారు.ఈనెల 4న బాధితుడు మురళీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు.