కారు కొనేవారికి అలర్ట్.. ఇలా చేస్తే చాలా లాభపడతారు!

కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్ ఎప్పటికప్పుడు సరికొత్త పవర్‌ఫుల్ ఇంజన్లను పరిచయం చేస్తోంది.తాజాగా ఈ కంపెనీ తన న్యూ జనరేషన్ వెర్నా సెడాన్‌లో కొత్త 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆఫర్ చేయనున్నట్లు వెల్లడించింది.ఈ ఇంజన్ 160 PS పవర్, 253 Nm టార్క్ ప్రొడ్యూస్ చేయడం విశేషం.

 Hundai New Generation Verna Sedan Coming With Turbo Charge Petrol Engine With Bs-TeluguStop.com

ప్రస్తుతం వెర్నా సెడాన్‌లో ఈ రేంజ్‌లో పవర్ ప్రొడ్యూస్ చేస్తున్న కారు లేదు.కాబట్టి కొనుగోలు చేయాలనుకునేవారు దీని కోసం కొద్ది నెలలు వెయిట్ చేయడం మంచిదే.

ఇకపోతే ఇదే ఇంజన్‌ను హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో కూడా అందించనున్నారు.1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ BS6 స్టేజ్ 2కి సంబంధించి రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలను అనుగుణంగా ఉండటం లేదు.అందుకే దీన్ని నిలిపివేసి కొత్త ఇంజన్ తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది.

ఈ పెట్రోల్ ఇంజన్ కేవలం 140 PS, 242 Nm డార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.దీని అర్థం కొత్త 1.5L ఇంజన్, 1.4L ఇంజన్ కంటే చాలా పవర్‌ఫుల్ అని స్పష్టమవుతోంది.

Telugu Bs, Hundai, Hyundai Cars, Hyundai Verna, Cars, Engine Cars, Verna Sedan,

ఇంటర్నేషనల్ మార్కెట్లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది.కాగా ఇండియా స్పెక్ వెర్షన్‌లో హైబ్రిడ్ పవర్ట్రెయిన్ అందించరని తెలుస్తోంది.ఈ ఇంజన్‌ 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంటుంది.అప్‌కమింగ్ వెర్నాలో 1.5L, 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వనున్నారు.

Telugu Bs, Hundai, Hyundai Cars, Hyundai Verna, Cars, Engine Cars, Verna Sedan,

కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారు కొద్దిరోజులు ఆగి దీన్నే కొనుగోలు చేయడం ద్వారా చాలా లాభపడొచ్చు.హ్యుందాయ్ మోటార్ ఇండియా న్యూ జనరేషన్ వెర్నా మార్చి 21న విడుదల చేయనున్నట్లు ఈరోజు వెల్లడించింది.సెడాన్ ధరలు రూ.10.5 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయని అంచనా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube