ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ( Salaar ) రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ సినిమా 2 గంటల 55 నిమిషాల నిడివితో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
భారీస్థాయిలో థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యేలా ఈ సినిమా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.అయితే ఆంధ్రలో ఈ సినిమా హక్కులు 85 కోట్ల రూపాయలకు అమ్ముడవగా తెలంగాణలో 90 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
ఈ సినిమా సీడెడ్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడవగా ఎంత మొత్తానికి అమ్ముడయ్యాయో తెలియాల్సి ఉంది.తెలుగు రాష్ట్రాల్లో సలార్ మూవీ 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడం అంటే ఒకింత షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిన సినిమాకు కలెక్షన్లు రావాలంటే కనీసం 400 కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు రావాలి.సలార్ మూవీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందేమో చూడాల్సి ఉంది.
సలార్1 డిసెంబర్ లో విడుదలైతే సలార్2 మూవీ మాత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.సలార్2 సినిమాకు మరింత భారీ స్థాయిలో బిజినెస్ జరగాలంటే సలార్1 మూవీ అంచనాలకు మించి హిట్ కావాల్సి ఉంటుంది.సలార్ మూవీలో శృతి హాసన్ రోల్( Shruti Haasan ) కూడా స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.ప్రభాస్ శృతి కాంబినేషన్( Prabhas ) లో ఇదే తొలి సినిమా కాగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సలార్ రిలీజ్ కు నెల రోజుల సమయం ఉండగా ప్రమోషన్స్ సరిగ్గా చేస్తే మాత్రం ఈ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.