సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కోడి రామకృష్ణ ఒకరు ఈయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో మంచి విజయాలను అందుకున్నాయి.ముఖ్యంగా ఈయన చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోలతో సినిమాలు చేస్తే మంచి విజయాలను అందుకున్నారు.
ఇక ఈయన వడ్డే నవీన్ ( Naveen Vadde )తో చేసిన పెళ్లి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే పెళ్లి సినిమాని( Pelli movie ) ముందుగా కోడి రామకృష్ణ వెంకటేష్ తో చేద్దామని అనుకున్నారు అంట కానీ ఆ కథ సురేష్ బాబు విని అది వెంకటేష్( Venkatesh ) కి అంత బాగా సెట్ అవ్వదు.ఈ సబ్జెక్ట్ కి ఎవరైనా కొత్త హీరో అయితే బాగుంటుంది అని చెప్పడంతో కోడి రామకృష్ణ నవీన్ ని పెట్టి ఈ సినిమా తీసినట్టుగా కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.
ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.ఇక అప్పటినుండి నవీన్ కి ఈ సినిమా వల్లనే మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది.ఈ సినిమాలో మరో కీలక పాత్రలో పృథ్వి రాజ్ ( Prudhvi Raj )నటించి కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పృథ్వీరాజ్ ది ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ తనదైన రీతిలో చాలా బాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఆయన చాలా సినిమాలో నటించాడు.
అందులో కొన్ని సినిమాలు ఆయనకి మంచి విజయాలను అందించాయి.ఇక ఇప్పుడు బాలీవుడ్ లో రన్ బీర్ కపూర్( Ranbir kapoor ) హీరో గా చేస్తున్న ఎనిమల్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు… అయితే వెంకటేష్ చేయాల్సిన సబ్జెక్టు నవీన్ దగ్గరికి వెళ్ళి ఆయనకి ఒక మంచి విజయాన్ని అందించింది…
.