ట్రంప్ కి సొంత పార్టీ నుంచీ షాక్ తగులుతోంది..

ట్రంప్ ఎఫెక్ట్ మెల్ల మెల్లగా సొంత పార్టీనేతల తాకుతోంది.ప్రపంచదేశాలకి విసుగుతెప్పిస్తున్న ట్రంప్ చర్యలు ఆతరువాత అమెరికాని ఆ క్రమంలో వలస విధానాల వలన సొంత భార్య కి ఇప్పుడు తాజాగా ఇదే విధానంపై సొంత పార్టీ నేతలకి విసుగు తెప్పిస్తున్నాయి.ట్రంప్ ఒక్కడు తప్ప వలస విధానంపై అందరూ వ్యతిరేక గొంతు విన్పిస్తున్న తరుణంలో సైతం ట్రంప్ వలస జీవులపై ఉక్కు పాదం మోపాలని ప్రయత్నాలు చేస్తున్నాడు,,

 House Speaker Paul Ryan Opposes Trumps Decision-TeluguStop.com

విదేశీ వలస దారులకి చెక్ పెట్టాలని భావిస్తున్న ట్రంప్ కి ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వస్తుండడం అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది….అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం అమెరికాలో జన్మించే చిన్నారులు ఎవరికైనా పౌరసత్వ హక్కు లభిస్తుంది.చిన్నారి తల్లిదండ్రులు ఏ దేశం వారైనా సరే అమెరికాలో పిల్లలుగా పుడితే వారు అమెరికన్ సిటిజన్ అయిపోతారు.దీంతో చాలా మంది వలసదారులు ఇదే ప్లాన్ అప్లయి చేస్తూ అమెరికన్ పౌరసత్వం పొందుతున్నారట.

అయితే ఈ విధానం వలన అసలైన అమెరికన్ల కి ఎంతో అన్యాయం జరుగుతోందని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.తాజాగా బుధవారం ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.‘ఇక్కడికి వేరే దేశం నుంచి వచ్చి బిడ్డను కంటే ఆ చిన్నారికి అమెరికా పౌరసత్వం దానంతట అదే వస్తోంది.అమెరికా పౌరులకుండే సకల ప్రయోజనాలు 85 ఏళ్ల పాటు ఆ చిన్నారి పొందుతోంది.

ఈ పద్ధతికి చరమగీతం పాడాలనుకుంటున్నా’ అని స్పష్టం చేశారు.ఈ నిర్ణయం పట్ల సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, ప్రతినిధుల సభ స్పీకర్ పౌల్ రేయాన్ దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

పౌరసత్వ హక్కును ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో తొలగించలేరని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube