తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ ముందుకు వెళ్తున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా రంగంలోకి దిగిన పోలీసులు ముందస్తుగా ముఖ్య నేతలను గృహా నిర్బంధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే మల్లు రవి, అద్దంకి దయాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.