Adivi Sesh Hit 2 : హిట్ 2 ప్రభావం.. అడివి శేష్ ఇక చిక్కడు దొరకడు

ఈ ఏడాది మేజర్ సినిమా తో ఇప్పటికే సూపర్ హిట్ దక్కించుకున్న అడివి శేష్‌ పాన్‌ ఇండియా స్టార్‌ గా మంచి పేరును దక్కించుకున్న విషయం తెల్సిందే.అంతే కాకుండా హిట్‌ 2 తో ఇదే ఏడాది మరో సూపర్ హిట్ ను దక్కించుకున్నాడు.

 Hit 2 Movie Hit And Adivi Sesh Full Busy , Adivi Sesh , Hit 2 Movie, Flim News,-TeluguStop.com

అడవి శేష్‌ స్వతహాగా రచయిత అవ్వడం వల్ల మంచి కథలు ఎంపిక చేసుకోవడంతో పాటు స్క్రీన్‌ ప్లే విషయంలో తన యొక్క ఆలోచనలు పంచుకుంటూ ఉండటం వల్ల ఫలితం పాజిటివ్‌ గా వస్తుంది.హిట్ 2 విషయంలో కూడా అదే జరిగింది.

ఈ సినిమా విజయంతో అడవి శేష్‌ యొక్క క్రేజ్ రెట్టింపు అయ్యిందని చెప్పాలి.మేజర్ సినిమా దేశ భక్తి మరియు సెంటిమెంట్‌ కారణంగా అడవి శేష్‌ కు రావాల్సినంత పేరు రాలేదనే చెప్పాలి.

కానీ హిట్‌ 2 పూర్తి స్థాయి రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీ అవ్వడం వల్ల కచ్చితంగా పూర్తి క్రెడిట్‌ అడవి శేష్ కు ఇవ్వాల్సిందే.అందుకే ఈ సినిమా తర్వాత అడవి శేష్ వరుసగా సూపర్‌ కమర్షియల్‌ సినిమాలకు కమిట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Telugu Adivi Sesh, Mahesh Babu, Nani, Telugu-Movie

మేజర్ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న అడవి శేష్‌ ఇప్పుడు హిట్‌ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.కనుక ముందు ముందు ఆయన నటించే సినిమా లు అన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలు అవుతాయి.అందుకే ఈయన భారీగా పారితోషికంను పెంచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ఈ మధ్య కాలంలో అడవి శేష్‌ యొక్క ఆధరణ విపరీతంగా పెరిగింది.

అడవి శేష్‌ ఇటీవల తీసుకున్న పారితోషికం కు రెట్టింపు పారితోషికం ఇచ్చి సినిమా లను నిర్మించేందుకు పలువురు ప్రముఖ నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారట.అంతే కాకుండా ఈయన తో సినిమా లు తీసేందుకు యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ దర్శకులు చాలా మంది క్యూ లో ఉన్నారు.

అందుకే ఇక అడివి శేష్ చిక్కడు దొరకడు అంటూ ప్రచారం జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube