లోకంలో ప్రతి మనిషిని పోలిన ఏడుగురు మనుషులు ఉంటారని చాలామంది అంటుంటారు.ఏడుగురేమో కానీ ఒకరిని పోలిన మరొకరు కచ్చితంగా ఉంటారని చాలాసార్లు నిరూపితమైంది.
మనలాంటి వాళ్లు కూడా ఈ లోకంలో ఉండవచ్చు కానీ ఆ విషయం తెలుసుకోవడం కష్టం కానీ సెలబ్రిటీల విషయానికొస్తే వారి లాంటి ఇతరులు ఉన్నారని ఈజీగా తెలుస్తుంది.మోదీ, రజినీకాంత్ ఇలాంటి ప్రముఖులను పోలిన వ్యక్తులు ఇప్పటికే వెలుగులోకి వచ్చి ఆశ్చర్యపరిచారు.
ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు ఒకరినొకరు పోలి ఉంటూ ఆశ్చర్యపరుస్తుంటారు.వారెవరో చూసేద్దాం.
1.అమితాబ్ బచ్చన్ – సోనూ సూద్
ఆరడుగుల అందగాడు, బాలీవుడ్ దిగ్గజ హీరో అమితాబ్ బచ్చన్( Amitab Bachchan ) పోలిన మనుషులు ఉంటారా అని మనం అనుకోవచ్చు కానీ ఈయన లాగే ఉండే మరొకరు నిజంగానే ఉన్నారు.అతడు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా కొనసాగుతున్నాడు.రియల్ లైఫ్ లో మాత్రం అతను ఒక హీరో.ఇంకా గుర్తు రాలేదా, అదేనండి అదే సోనూ సూద్.( Sonusood ) బిగ్ బి యంగ్ యుక్త వయసులో ఎలా ఉండేవాడో ఇప్పుడు సోనూ సూద్ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాడు.
2.మహేష్ బాబు – ప్రిన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు,( Mahesh Babu ) యాక్టర్ ప్రిన్స్ సేమ్ హైట్, సేమ్ కలర్, సేమ్ ఫేస్ కలిగి ఉంటారు.
3.రామ్ చరణ్-యశ్
రామ్ చరణ్,( Ram Charan ) యశ్( Yash ) ఇద్దరు హీరోలు కూడా సేమ్ టు సేమ్ ఉంటారు.కొన్ని యాంగిల్స్‌లో చూస్తేనే వీరు ఒకేలా ఉంటారు.మామూలుగా చూస్తే ఇద్దరి మధ్య పోలిక ఉన్నట్లు అనిపించదు.
4.ధనుష్ – ప్రదీప్ రంగనాథన్
నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, ( Dhanush ) లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ కూడా సేమ్ లుక్ కలిగి ఉంటారు.
5.విజయ్ – విక్రాంత్ – జై
తమిళ్ పవర్ స్టార్ దళపతి విజయ్, అతడి కజిన్ విక్రాంత్ కూడా చూడ్డానికి కొద్దిగా కవల పిల్లల్లా ఉంటారు.రాజా రాణిలో హీరోగా నటించిన జై కూడా విజయ్ పోలికలు కలిగి ఉన్నాడు.
6.నాని – శివ కార్తికేయన్
హీరో నానికి,( Nani ) కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్‌కు( Shiva Karthikeyan ) మధ్య పోలికలు దగ్గరగా ఉంటాయి.జోక్ ఏంటంటే వీరి కామెడీ టైమింగ్ కూడా ఒకేలా ఉంటుంది.
7.రామ్ – అరుణ్ అదిత్
స్టార్ హీరో రామ్, యంగ్ హీరో అరుణ్ అదిత్ కూడా అచ్చు గుద్దినట్లు ఉంటారు.