టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )తో ఇప్పటికే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు ఈ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు లాభాలను అందించింది.సినిమా సినిమాకు బాలయ్య మార్కెట్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.
భగవంత్ కేసరి శ్రీలీల కెరీర్ లో సైతం స్పెషల్ సినిమాగా నిలిచింది.విజ్జిపాప రోల్ లో శ్రీలీల నటన మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
అయితే భగవంత్ కేసరి సక్సెస్ తో శ్రీలీల ( Sreeleela )తన రెమ్యునరేషన్ ( Remuneration )ను భారీగా పెంచేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే కోటి రూపాయలు అదనంగా ఈ బ్యూటీ డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ కావడంతో నిర్మాతలు సైతం ఆమె డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు.శ్రీలీల తన నటనతో ఆకట్టుకుంటూ సినిమాకు బిజినెస్ విషయంలో మేలు చేస్తుండటంతో ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
శ్రీలీల తన దగ్గరకు వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పకుండా కచ్చితంగా హిట్ అవుతుందనే కథలకు మాత్రమే ఓకే చెబుతున్నారు.శ్రీలీల నెలకో సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
శ్రీలీల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుని 2024 సంవత్సరంలో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శ్రీలీల పారితోషికం విషయంలో ఫ్యాన్స్ కు షాకిస్తున్నారు.తెలుగు సినిమాలకే శ్రీలీల ఎక్కువగా ఓటేస్తున్నారు. శ్రీలీల( Sreeleela ) 2024 సంవత్సరంలో కూడా భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
శ్రీలీల రేంజ్, క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే.