ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో యమ జోరుగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఎవరు అంటే వెంటనే వినిపించే పేర్లలో శ్రీలీల( Sreeleela ) పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.హీరో ఎవరైనా హీరోయిన్ గా శ్రీలీల ఉండాలి అన్నట్లుగా చర్చ జరుగుతోంది.
మహేష్ బాబు( Mahesh Babu )తో గుంటూరు కారం సినిమా( Guntur Kaaram ) లో నటిస్తున్న ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ సినిమా లో హీరోయిన్ గా ఎంపిక అయింది.
ఇక చిరంజీవి సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయిందనే వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ మరియు బుచ్చి బాబు కాంబో మూవీ లో ఈమెను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.మొత్తానికి శ్రీలీల జోరు మామూలుగా లేదు.
ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు మరియు ముందు ముందు కమిట్ అవ్వబోతున్న సినిమాలను చూస్తూ ఉంటే 2025 వరకు శ్రీలీల సినిమా లు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఏకంగా నెలకు ఒకటి లేదా రెండు నెలలకు ఒకటి చొప్పున అయినా కూడా 2025 సంవత్సరం వరకు శ్రీలీల సినిమా లు రాబోతున్నాయి.
ఈ రేంజ్ లో ఏ హీరోయిన్ కూడా ప్రస్తుతం తెలుగు లో సినిమా లు చేయడం లేదు.ఇన్ని సినిమా లు చేస్తున్న శ్రీ లీల తక్కువ పారితోషికం కు ఏమైనా చేస్తుందా అంటే లేదు అనే సమాధానం వస్తుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల ప్రస్తుతం కోటి నుండి మూడు కోట్ల రూపాయల వరకు పారితోషికం ను తీసుకుంటూ ఉంది.హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమా ల జాబితా ఓ రేంజ్ లో ఉంది.
ప్రస్తుతం బాలయ్య తో కలిసి భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) లో నటిస్తున్న విషయం తెల్సిందే.హీరోయిన్ గా శ్రీలీల నటిస్తూనే మరో వైపు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం విడ్డూరంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.