తండ్రికి డిఫరెంట్ గా విషెష్ చెప్పిన చరణ్.. మనవరాలితో నవ్వులు చిందిస్తున్న చిరు..

ఈ రోజు టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు( Chiranjeevi Birthday ) అనే విషయం తెలుగు ప్రేక్షకులకు అందరికి తెలుసు.ఈయన పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు.

 Ram Charan Heartfelt Post From Chiranjeevi Birthday Details, Chiranjeevi Birthda-TeluguStop.com

హంగామా మొత్తం ఫ్యాన్స్ దే అంటూ రెచ్చిపోతున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరోకు విషెష్ అందిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు విషెష్ చెబుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.ఫ్యాన్స్( Chiranjeevi Fans ) మాత్రమే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరి చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) కూడా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

ఈసారి కాస్త డిఫరెంట్ గా పోస్ట్ చేసారు.ఈ ఏడాది చిరంజీవి ఇంట ముద్దుల మనవరాలు మెగా లిటిల్ ప్రిన్సెస్( Mega Little Princess ) వచ్చిన విషయం తెలిసిందే.మరి తాతకు విషెష్ చెబుతున్నట్టుగా రామ్ చరణ్ పోస్ట్ చేసారు.

ప్రియమైన చిరుతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.చిరంజీవి తాత అంటూ మనవరాలు విష్ చేసినట్టు రామ్ చరణ్ పోస్ట్ చేసారు.

మా నుండి మా కొణిదెల కుటుంబం లోని లిటిల్ మెంబర్ నుండి విషెష్ అంటూ చరణ్ తెలిపారు.అలాగే తన కూతురు క్లింకారను( Klin Kaara ) చిరు ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తున్న పిక్ షేర్ చేసారు.అయితే ఇప్పుడు కూడా కూతురు ఫోటోను అయితే కనపడకుండా చరణ్ జాగ్రత్తలు తీసుకున్నారు.మొత్తానికి బర్త్ డే వేళ మెగా ఇంట సందడి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube