తండ్రికి డిఫరెంట్ గా విషెష్ చెప్పిన చరణ్.. మనవరాలితో నవ్వులు చిందిస్తున్న చిరు..
TeluguStop.com
ఈ రోజు టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు( Chiranjeevi Birthday ) అనే విషయం తెలుగు ప్రేక్షకులకు అందరికి తెలుసు.
ఈయన పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు.
హంగామా మొత్తం ఫ్యాన్స్ దే అంటూ రెచ్చిపోతున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరోకు విషెష్ అందిస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు విషెష్ చెబుతూ నెట్టింట హంగామా చేస్తున్నారు.
ఫ్యాన్స్( Chiranjeevi Fans ) మాత్రమే కాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరి చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) కూడా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.
"""/" /
ఈసారి కాస్త డిఫరెంట్ గా పోస్ట్ చేసారు.ఈ ఏడాది చిరంజీవి ఇంట ముద్దుల మనవరాలు మెగా లిటిల్ ప్రిన్సెస్( Mega Little Princess ) వచ్చిన విషయం తెలిసిందే.
మరి తాతకు విషెష్ చెబుతున్నట్టుగా రామ్ చరణ్ పోస్ట్ చేసారు.ప్రియమైన చిరుతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
చిరంజీవి తాత అంటూ మనవరాలు విష్ చేసినట్టు రామ్ చరణ్ పోస్ట్ చేసారు.
"""/" /
మా నుండి మా కొణిదెల కుటుంబం లోని లిటిల్ మెంబర్ నుండి విషెష్ అంటూ చరణ్ తెలిపారు.
అలాగే తన కూతురు క్లింకారను( Klin Kaara ) చిరు ఎత్తుకుని చిరునవ్వులు చిందిస్తున్న పిక్ షేర్ చేసారు.
అయితే ఇప్పుడు కూడా కూతురు ఫోటోను అయితే కనపడకుండా చరణ్ జాగ్రత్తలు తీసుకున్నారు.
మొత్తానికి బర్త్ డే వేళ మెగా ఇంట సందడి నెలకొంది.
ఆపరేషన్ బ్లూ స్టార్ … నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి