విజయ్ కాంత్( Vijaykanth ) తమిళనాడు లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలగడమే కాదు.ఆయనను అందరూ ముద్దుగా కెప్టెన్( Captain ) అని పిలుచుకునే వారు.
అయితే విజయ్ కాంత్ డిసెంబర్ 28వ తారీకున కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.చాలా రోజులుగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
నిమోనియా బారిన పడిన విజయ్ కాంత్ అనేక రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే మధ్య మధ్యలో కోలుకుంటున్నప్పటికీ మళ్లీ ఆయనకు కరోనా వైరస్( Corona Virus ) కూడా సోకడం తో తిరిగి కోలుకోలేక పోయారు.
చెన్నైలోనే ఒక ప్రముఖ ఆసుపత్రిలోనే ఆయన కన్నుమూశారు.అయితే విజయ్ కాంత్ కు ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా తమిళనాడు లో మంచి అభిమాన ఘనం ఉంది.మధురై కి చెందిన విజయ్ కాంత్ 1952 లో పుట్టారు.1990లో ప్రేమలత( Premalatha ) అనే ఒక మహిళను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
అందులో ఒక కుమారుడు అయిన షణ్ముఖ పాండియన్( Shanmuga Pandian ) నటుడిగా కూడా రాణిస్తున్నారు.అయితే ప్రేమలతతో విజయ్ కాంత్ వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి.వీరిద్దరిదీ పెద్దలు కుదిరిచిన వివాహమే.అయితే గతంలో ప్రేమలత ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి.
విజయ్ కాంత్ మధురై వాసి కాగా ప్రేమలత కుటుంబం వెల్లూరులో స్థిరపడిన వారు.
ముందు నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి బంధుత్వం లేదు.మొదటిసారి పెళ్లి చూపుల్లోనే ప్రేమలతను చూసి విజయ్ కాంత్ ఆమెతో పెళ్లికి ఒప్పుకున్నారట.చాలా సాధారణ వ్యక్తిగా తన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడని ఆ తర్వాత మా ఇద్దరికీ బాగా పరిచయం పెరిగి పెళ్లికి ముందు చాలా రోజుల పాటు ప్రేమించుకున్నామని తమ మధ్య ఎన్నో మరిచిపోలేని అనుభూతులు ఉన్నాయి అని ప్రేమలత చెప్పారు.
మా ప్రేమకు గుర్తుగా ఇద్దరు కొడుకులను ఆ దేవుడు ప్రసాదించాడని, పెళ్లి తర్వాత తన జీవితం ఎంత చక్కగా ఉందని ప్రేమలత తెలిపారు.