హ్యాపీడేస్ ( Happy Days ) సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddharth ).ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి నిఖిల్ అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన కార్తికేయ 2 సినిమా( Karthikeya 2 ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ప్రస్తుతం నిఖిల్ మరో మూడు సినిమాల షూటింగ్ పనులలో ఎంత బిజీగా ఉన్నారు.
ఇలా ఒక వైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటుంటే మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో కూడా నిఖిల్ ఎంత సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా నిఖిల్ ఇంత సంబరాలు మొదలయ్యాయి.నిఖిల్ భార్య పల్లవి ( Pallavi )నేడు ఉదయం పండంటి మగ బిడ్డకు( Baby Boy) జన్మనిచ్చారు.
ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.నిఖిల్ భార్య పల్లవి మగ బిడ్డకు జన్మనివ్వడంతో నిఖిల్ తండ్రిగా మారిపోయారు.
ఈ క్రమంలోనే తన కొడుకును చేతులలోకి తీసుకొని ప్రేమతో ముద్దాడుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నిఖిల్ పల్లవిది ప్రేమ వివాహం.వీరిద్దరి వివాహం 2020వ సంవత్సరంలో జరిగింది.ఇక పల్లవి వృత్తిపరంగా వైద్యురాలు అనే విషయం మనకు తెలిసిందే.ఇక ఇటీవల తన భార్య సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియా( Social media )లో షేర్ చేస్తూ మా బిడ్డకు స్వాగతం పలకడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పకు వచ్చారు.ఇక నేడు తనకు కుమారుడు పుట్టడంతో నిఖిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.