థియేటర్ లో విడుదలైన రోజే ఇంట్లో సినిమా.. ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ ఫైబర్ నెట్( AP Fiber net ) మరో అడుగు ముందుకేసింది.రిలీజ్ అయిన రోజే కొత్త సినిమాను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చూసే ఫెసిలిటీని తీసుకొస్తోంది.

 Here The Apsfl First Day First Show Details, Apsfl, First Day First Show, Andhra-TeluguStop.com

ఈ మేరకు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి( APSFL Goutham reddy ) కీలక ప్రకటన చేశారు.కాగా థియేటర్‌ తరహాలో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో( First day first show ) చూసే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఛైర్మన్‌ గౌతమ్‌ రెడ్డి తాజాగా వెల్లడించారు.

అయితేఇందుకోసం నెలకు ఒకసారి కాకుండా రోజుకు ఒకసారి రీఛార్జ్‌ ( Recharge )చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.జూన్‌ 2న విశాఖ వేదికగా కొత్త సినిమా ప్రసారాలను ప్రారంభిస్తామని తెలిపారు.

Telugu Andhra Pradesh, Ap Latest, Apsfl, Apsfl Day, Day Show-Movie

ఒక వినూత్నమైన కొత్తదనాన్ని తీసుకురావడానికి థియేటర్‌లో ఏ రోజైతే సినిమా ప్రదర్శన జరుగుతుందో అదే రోజున ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ప్రేక్షకులు అందరూ వీక్షించేలా దీన్ని తీర్చిదిద్దాము.నిర్మాతలతో మాట్లాడిన తర్వాత సినిమా ప్రదర్శితమవుతుంది.కొత్త సినిమాలను సబ్‌స్క్రైబ్‌ చేసుకునేవారు వారికి 24గంటల పాటు అది అందుబాటులో ఉంటుంది.అయితే, ఇది ఓటీటీ ( OTT )ఫ్లాట్‌ఫాంలాంటిది కాదు.జూన్‌2న విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము.మూడు నెలల్లో పూర్తిస్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తాము.

ఇప్పటికే సినీరంగ ప్రముఖులతో చర్చలు జరిపాము.పెద్ద సినిమాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటాము అని చెప్పుకొచ్చారు గౌతమ్‌రెడ్డి.ఏపీ సినిమా ప్రేక్షకులకు నిజంగా ఇది ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు.ఎందుకంటే ఏపీ ఫైబర్ తీసుకోవచ్చునా ఈ అద్భుతమైన ఆఫర్ వల్ల ఇకపై సినిమా ధియేటర్ కు వెళ్లి అక్కడ గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి వేచి చూడాల్సిన పని లేదు.

ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాను వీక్షించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube