చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేసింది.

 Hearing On Chandrababu's Special Leave Petition Adjourned-TeluguStop.com

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ క్రమంలో తన అరెస్ట్ చెల్లదంటూ చంద్రబాబు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఈ కేసుపై గత మూడు రోజులుగా సుప్రీం ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.

ఈ క్రమంలోనే చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా సీఐడీ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.అన్ని కేసుల్లోనూ 17ఏ ను ఛాలెంజ్ చేస్తున్నామని లూథ్రా పేర్కొన్నారు.

దీనిపై సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ వర్తించదని చెప్పారు.సెక్షన్ 17ఏ జూలై 2018లో వచ్చిందన్న ఆయన స్కిల్ డెవలప్ మెంట్ నేరం 2015, 2016 నుంచే ఉన్నాయని తెలిపారు.

సెక్షన్ 17ఏ ప్రయోజనం ఏదీ ఈ కేసుకు ఇవ్వబడదని ముకుల్ రోహత్గి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube