తెల్ల ఉడుతను మీరు ఎపుడైనా చూశారా? అయితే ఇక్కడ చూడండి!

చిన్న చిన్న ప్రాణులలో ఉడుత అనేది చాలా అందమైన జీవి అని చెప్పుకోవచ్చు.చెట్ల మీద నివాసం వుంటూ దొరికే ఆకులను అలములను, కాయలను, గింజలను తింటూ ఉంటుంది.

 Have You Ever Seen A White Squirrel? But Look Here ,white Squrrel, Viral Latest,-TeluguStop.com

పిల్లల్ని కని పెంచడం వీటి ప్రత్యేకత.అన్నింటికంటే ముఖ్యంగా ఉడుతకు మన హిందూ పురాణ సంబంధం కూడ ఉండడంతో ప్రజలు చాలా ఆరాధనగా దానిని చూస్తారు.

శ్రీరామ చంద్రుడు శ్రీ లంకకు వెళ్లడానికి వారధి కడుతున్నపుడు ఉడుత నీళ్లలో మునిగి, ప్రక్కనే వున్న ఇసుకలో దొర్లి తన శరీరానికి అంటుకున్న ఇసుకను రాముడు కడుతున్న వారధిపైన విదిలించిందట.

అలా అది చేసిన ఈ చిన్న ఉడుతా సాయానికి శ్రీరాముడు మెచ్చి, దాని వీపుమీద ప్రేమతో నిమిరాడట ప్రతీతి.

అందుకే దాని వీపు మీద మూడు ఛారలుంటాయని పురాణ పుంగవులు చెబుతారు.అందుకే ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఉడుతా భక్తి అని మెచ్చుకోవడం అందరికీ తెలిసినదే.

కాగా ఈ ఉడుతలు అనేవి సాధారణంగా ఒకే రంగుని కలిగి వుంటాయని అందరికీ తెలిసిందదే.అయితే కొన్ని కొన్ని ప్రదేశాలను బట్టి ఉడుతలు చాలా రకాలుగా ఉంటాయి కానీ, దాదాపు అవి ముదురు గోధుమ రంగులోనే ఉండటం మనం గమనించవచ్చు.

అయితే మీరు ఎపుడైనా తెల్లని ఉడుతలు చూసారా? ఇవి చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి.అయితే తాజాగా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని రాయసముద్రం చెరువు కట్టపై బుధవారం తెల్లటి ఉడుత సందడి చేసి అందరికీ కనుల విందు చేసింది.కాగా ఈ ఉడతను ల్యూసిస్టిక్‌ అల్బినో స్కిరెల్‌గా పిలుస్తారు.ఇలాంటివి జన్యులోపం కారణంగా అలా తయారవుతాయని, స్థానికంగా వున్న బయాలజిస్టు లక్ష్మణ్‌ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube