'హనుమాన్' ప్రమోషన్స్.. స్టార్ట్ అయ్యేది అప్పుడే.. మేకర్స్ క్లారిటీ!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హను – మాన్'( Hanu Man ).ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Hero Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ లుగా నటించారు.

 Hanu-man Begins Promotions From Ganesh Festival, Hanu-man, Hanuman, Prashanth Va-TeluguStop.com

ఈ సినిమా స్టార్టింగ్ లో పెద్దగా అంచనాలు ఏవీ లేవు.కానీ ఆ తర్వాత మాత్రం అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ తో అంచనాలు భారీగా పెరిగాయి.దీంతో ఈ సినిమాను పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు.అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ లేకుండా ఉండాలని సినిమాను వాయిదా వేశారు.ఈ సినిమాను ఏకంగా 6 నెలల వాయిదా వేసి సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.అయితే రిలీజ్ వాయిదా వేసిన తర్వాత ఈ సినిమా గురించి మేకర్స్ మరొక అప్డేట్ ఇవ్వలేదు.

కానీ తాజాగా మేకర్స్ అఫిషియల్ గా ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.ఈ సినిమా ప్రమోషన్స్ ను వినాయక చవితి నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

ఇదే విషయాన్నీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashanth Varma ) సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇదిలా ఉండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఇప్పటికే చాలా పోటీ ఉన్న నేపథ్యంలో హనుమాన్ మాత్రం తగ్గడం లేదు.ఈ సినిమా పక్కాగా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ముందు నుండి భారీ సినిమాల పోటీ ఉంది అనుకున్న నేపథ్యంలో అందులో కొన్ని వాయిదా పడనున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే ప్రభాస్ కల్కి( Kalki 2898 AD ) వాయిదా పడింది.మరి చివరికి ఏ సినిమాలతో హనుమాన్ పోటీ పడబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube