చిన్న సినిమాకి అలనాటి సూపర్ హిట్ సినిమా టైటిల్! ట్రైలర్ కూడా రిలీజ్

గుండమ్మ కథ పేరు చెప్పగానే అందరికి ఎన్టీఅర్, ఏఎన్నార్, సావిత్రి, సూర్యకాంతం, ఎస్వీరంగారావు లాంటి మహా నటులు నటించిన ఒకప్పటి సూపర్ హిట్ సినిమా మనకి గుర్తుకొస్తుంది. గుండమ్మ కథ అనగానే ఆ సినిమాని తప్ప మరో సినిమాని ఊహించుకోలేం.

 Gundamma Katha Title For Small Budget Cinema, Tollywood, Telugu Cinema, South Ci-TeluguStop.com

ఇప్పటికి ఆ సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.ఈ సినిమాని నందమూరి, అక్కినేని ఫ్యామిలీ హీరోలతో కలిసి రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

అయితే ఒరిజినల్ సినిమా ఫీల్ చెడగొట్టినట్లు అవుతుందేమో అనే ఉద్దేశ్యంతో ఆ ప్రయత్నం ఎవరు చేయడం లేదు.అందులో కొన్ని పాత్రలని రిప్లేస్ చేసే స్థాయి నటులు కూడా లేకపోవడం గుండమ్మ కథ సినిమాని రీమేక్ చేయకపోవడానికి ఒక కారణం అని వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టైటిల్ తో ఓ చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది.

ఆదిత్య క్రియేష‌న్స్‌ ప‌తాకంపై ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ స్వీయ నిర్మాణంలో కృష్ణంరాజు ద‌ర్శ‌కునిగా ఈ గుండ‌మ్మ క‌థ‌ సినిమా తెరకెక్కుతుంది.

ఈ చిత్రంతో ఆదిత్య, ప్ర‌ణ‌వ్య హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు.అన్నివర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే విధంగా హోల్స‌మ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి నిర్మాతగా ఉన్న ల‌క్ష్మీ శ్రీవాత్స‌వ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

అంతేకాకుండా కృష్ణంరాజుతో క‌లిసి ద‌ర్శ‌క‌త్వ భాద్య‌త‌లు కూడా నిర్వ‌హించారు.అల‌‌నాటి గుండ‌మ్మ క‌థ ఏ రేంజ్ లో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేసిందో అంతే స్థాయిలో ఈత‌రం ఆడియెన్స్ కి క‌నెక్ట్ అయ్యే రీతిన ల‌వ్, కామెడీ, సెంటిమెంట్ త‌దిత‌ర అంశాల‌తో కూడా స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌న‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది.

తాజాగా గుండ‌మ్మ క‌థ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు.అలానే క‌‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

మరి ఆ గుండమ్మ కథని ఈ గుండమ్మ కథ మరిపిస్తుందా లేక అన్ని సినిమాల తరహాలోనే ఇది కూడా ఉండిపోతుందా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube