అమెరికాలోని ఓ బడా బ్యాంక్ లో దొంగతనం జరిగింది.సొత్తు మొత్తం ఇచ్చేయండి అంటూ ఆ దొంగ బ్యాంక్ ఉద్యోగులని తుపాకీతో బెదిరించాడు.
డబ్బు బ్యాగ్ లో సద్దగానే దొంగ ఈ బ్యాగ్ తీసుకుని ఎంతో నెమ్మదిగా వెళ్ళటం గమనించిన బ్యాంక్ అధికారులు షాక్ అయ్యారు.అదేంటి బ్యాగ్ చేతికి అందగానే దొంగలు పరుగు పరుగున వెళ్లి కారు ఎక్కేస్తారు కదా అంటూ పోలీసులకి ఫోన్ చేశారు.
ఇంతకీ ఆ దొంగ ఎందుకు అంత నెమ్మదిగా వెళ్ళాడు.
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న గ్రీన్ విల్లె లో గల ఓ బ్యాంక్ లోకి ఓ దొంగ వచ్చాడు.
అక్కడి బ్యాంక్ అధికారుల వద్దకి వెళ్లి వారి ముందు ఓ బ్యాగ్ పడేసి, మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసి ఇందులో సద్దేయండి అంటూ తుపాకీ తో బెదిరించాడు.దాంతో ఉద్యోగులు అందరూ భయపడి పోయి డబ్బులు సర్దేశారు.
ఆ బ్యాగ్ తీసుకున్న అతడు మెల్లగా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కాడు.ఈ ఘటన చూసిన ఉద్యోగులు పోలీసులకి ఫిర్యాదు చేయగా ఆ కారును అడ్డగించి బయటకి రా అంటూ అరిచారు.
తీరా డోర్ తీసుకుని దొంగ బయటకి రాగానే అతడిని చూసి షాక్ అయ్యారు పోలీసులు.అతడు డబ్బు దొంగతనం చేసిన తరువాత అంత నీరసంగా నడుచుకుంటూ వెళ్ళడానికి ఇదే కారణం అంకున్నారు ఎందుకంటే సదరు దొంగ కి 86 ఏళ్ళ వయసు ఉంటుంది.అతడి ముఖం ఎంతో నీరసించి పోయి ఉంది.అంతేకాదు అతడపై అనేక నేరాలలో కేసులు నమోదయ్యి ఉన్నాయి కూడా.ఇంత వయసు వచ్చినా ఈ దొంగానాలు ఎందుకు చేస్తున్నావని పోలీసులు అడుగగా వేరే వృత్తి చేయడం కుదరక ఈ దొంగతనాలనే కొనసాగిస్తున్నానని అతడు పోలీసులకి తెలిపాడు.దాంతో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాత కేసులు కూడా తిరగ తోడుతున్నారని స్థానిక మీడియా తెలిపింది.