కస్తూరిబా గిరిజన పాఠశాలకు కంకర రోడ్డు కష్టాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కస్తూరిబా గిరిజన గురుకుల పాఠశాలకు( kasturbha gandhi baalika vidyalaya ) వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక గత కొన్నేళ్ళుగా పాఠశాల స్టాఫ్,పిల్లలు,పేరెంట్స్ నానా అవస్థలు పడుతున్నారు.దేశంలోనే నెంబర్ 1 బంగారు తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో పేద పిల్లలు చదివే పాఠశాలను పూర్తిగా విస్మరించి, గల్లీగల్లీకో బెల్ట్ దుకాణం తెరిచి అభివృద్ధి మంత్రం జపిస్తున్న సర్కార్ తీరుపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Gravel Road Difficulties For Kasturiba Tribal School...!-TeluguStop.com

ఇన్ని రకాల ఉచిత పథకాలను తెస్తున్న ప్రభుత్వానికి గిరిజన పాఠశాల పరిస్థితి కనిపిస్తలేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ప్రతీ ఒక్కరూ రావడం హామీ ఇవ్వడం,గెలిచినాక పత్తా లేకుండా పోవడం ఆనవాయితీగా మారిందనిమండిపడుతున్నారు.

కంకర తేలిన రోడ్డుపై రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు గురవుతున్నామని పాఠశాల స్టాఫ్,పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల యాజమాన్యం,స్థానిక ప్రజా ప్రతినిధులు ఏళ్ల తరబడి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు.

రాజకీయ పార్టీలకు ఓటర్లు ముఖ్యం కానీ,ఆ ఓటర్ల పిల్లలు ముఖ్యం కాదా అని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.పాలకులకు ఓట్లు,సీట్ల ధ్యాసే తప్పా పిల్లల భవిష్యత్ పట్టదా? పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలపై పాలకులు పక్షపాత వైఖరి చూపిస్తూ ఆ వర్గాలను విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని విద్యార్ది సంఘాల నాయకులు( Student unions ) ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాబోయే పాలకులైనా ఈ పాఠశాల స్థితి గతులను మార్చాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube